Just SportsLatest News

IND vs SA : భారత్, సౌతాఫ్రికా సూపర్-8 పోరు..గత రికార్డుల్లో పైచేయి ఎవరిదో తెలుసా ?

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య గత రికార్డుల్లో ఎవరు పైచేయిగా ఉందనే దానిపై ఆసక్తి మొదలైంది. ఓవరాల్ గా టీ20 ఫార్మాట్ లో సౌతాఫ్రికాపై భారత జట్టుదే ఆధిపత్యంగా ఉంది.

IND vs SA

టీ20 ప్రపంచకప్ లో అసలు సిసలు మ్యాచ్ లకు కౌంట్ డౌన్ మొదలైంది. సూపర్ 8 రౌండ్ ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ తో షురూ కాబోతోంది. ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్ 8 మ్యాచ్ జరగబోతోంది. గ్రూప్ స్టేజ్ లో రెండు జట్లు ఒక్క ఓటమి లేకుండా ఆడిన నాలుగు మ్యాచ్ లూ గెలిచాయి. దీంతో ఇప్పుడు రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గ్రూప్ స్టేజ్ లో కొన్ని బలహీనతలు బయటపడిన టీమిండియా సౌతాఫ్రికాపై పూర్తిస్థాయి ప్రదర్శన కనబరచాలని పట్టుదలగా ఉంది.

ఈ నేపథ్యంలో భారత్, సౌతాఫ్రికా మధ్య గత రికార్డుల్లో ఎవరు పైచేయిగా ఉందనే దానిపై ఆసక్తి మొదలైంది. ఓవరాల్ గా టీ20 ఫార్మాట్ లో సౌతాఫ్రికాపై భారత జట్టుదే ఆధిపత్యంగా ఉంది. ఇప్పటి వరకు రెండు జట్లు 35 మ్యాచ్ లలో తలపడగా.. భారత్ 21 సార్లు విజయం సాధించింది. అటు సౌతాఫ్రికా 13 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

IND vs SA
IND vs SA

ఓవరాల్ రికార్డుల్లోనే కాకుండా ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనూ భారత్ దే పైచేయిగా ఉంది. ఈ మెగాటోర్నీ హిస్టరీలో రెండు జట్లు ఇప్పటి వరకూ 7 సార్లు తలపడితే టీమిండియా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది. సౌతాఫ్రికా కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది.

ఇదిలా ఉంటే గత ఏడాది ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్, సౌతాఫ్రికా మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉత్కంఠతో ఊపేసిన ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సఫారీలను ఓడించింది.

చివర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన సంచలన క్యాచ్ తో రెండోసారి టీ20 ప్రపంచకప్ భారత్ సొంతమైంది. ఆ మ్యాచ్ ఫలితం దక్షిణాఫ్రికా అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. గెలిచే మ్యాచ్ లో ఓడిపోవడంతో చాలా రోజులు ఆటగాళ్లు సైతం నిరాశలోనే కనిపించారు. కాగా ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ గ్రూప్ స్టేజ్ లో యూఎస్ఏ, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. అటు సౌతాఫ్రికా కెనడా, ఆప్ఘనిస్థాన్, న్యూజిలాండ్, యూఏఈ జట్లపై గెలుపొందింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button