Just EntertainmentLatest News

Megastar:మెగాస్టార్, అశ్విని దత్ క్రేజీ కాంబో రిపీట్.. మైథాలజీ వండర్‌తో మెగా మూవీ

Megastar:వాల్తేరు వీరయ్యతో మాస్ విందు భోజనం పెట్టిన బాబీ కొల్లితో మరో మూవీని కూడా చిరు కన్ఫమ్ చేశారు.

Megastar

మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డులకు కేరాఫ్ అని మెగా ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో.. బాక్సాఫీస్ హిట్ కొట్టిన చిరు, ఇప్పుడు అంతకు మించిన భారీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు.

అందులో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ.. విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా భారీ గ్రాఫికల్ వండర్‌గా తెరకెక్కుతోంది. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మళ్లీ ఆ రేంజ్ సోషియో ఫాంటసీ మూవీగా ఇది రాబోతుండటంతో మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా కానీ వేసవిలో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

అంతేకాదు విశ్వంభర తర్వాత మెగాస్టార్ (Megastar)లైనప్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. వాల్తేరు వీరయ్యతో మాస్ విందు భోజనం పెట్టిన బాబీ కొల్లితో మరో మూవీని చిరు కన్ఫమ్ చేశారు. అలాగే దసరా సినిమాతో తన ముద్ర వేసిన యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను కూడా లైన్‌లో పెట్టారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్,అలాగే ఊర మాస్ లుక్‌లో ఉండబోతుందని టాక్. ఈ రెండూ కూడా షూటింగ్ దశకు చేరుకోవాల్సి ఉంది.

ఇవే కాకుండా తాజాగా ఫిలింనగర్లో ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్‌తో చిరంజీవి మళ్లీ జతకడుతున్నారంటూ టాక్ నడుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇంద్ర, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి క్లాసిక్ మూవీలు వచ్చాయి. ఇప్పుడు ఆ వైభవాన్ని మళ్లీ చూపించడానికి అశ్విని దత్ తన అల్లుడు, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి రంగంలోకి దిగుతున్నారు.

Megastar
Megastar

నిజానికి మహానటి తర్వాతే మెగాస్టార్‌(Megastar)తో నాగ్ అశ్విన్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్‌తో కల్కి ప్రాజెక్ట్ ముందుకు రావడంతో చిరు మూవీ వాయిదా పడింది. ఇప్పుడు కల్కి తరహాలోనే ఒక అద్భుతమైన మైథాలజీ సబ్జెక్టును నాగ్ అశ్విన్ చిరంజీవి కోసం సిద్ధం చేశాడట. అశ్విని దత్ సలహాతో చిరుకి కథ వినిపించడం, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి-2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ పూర్తయిన వెంటనే మెగాస్టార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో చిరంజీవి నటిస్తే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే ఈ మెగా ప్రాజెక్టుపై అఫీషియల్ ప్రకటన రాబోతోంది. మొత్తంగా ఈ వరుస సినిమాలతో చిరంజీవి రాబోయే రెండేళ్ల పాటు థియేటర్ల వద్ద మెగా జాతర చేయడం ఖాయం అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button