Women:మగవారికంటే మహిళలు ఎక్కువసేపు నిద్రపోవాలట.. ఎందుకో చూడండి. .
Women: చాలామంది మహిళలు ఒకే సమయంలో ఎన్నో పనులను నిర్వహించే మల్టీ టాస్కింగ్ స్వభావాన్ని కలిగి ఉంటారు.
Women
మహిళలు(Women )ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో అందరి కంటే ముందే లేచి అందరి కంటే లేటుగా పడుకుంటారు. ఒక్కోసారి కంటినిండా నిద్రే ఉండదు. ఇలా నిద్ర పట్టింది అనగానే తెల్లారిపోతుంది. అయితే నిద్ర సరిపోలేదన్న ఫీలింగ్ ఉన్నా కూడా.. కళ్ల ముందు మెదిలే పనులు గుర్తుకు వచ్చి టక్కున లేచిపోతారు. కానీ ఇది కరెక్ట్ కాదంటున్నారు డాక్టర్లు . వీలయితే మగవారి కంటే కాసేపు ఎక్కువ పడుకోవాలని అంటున్నారు.
ఇది కేవలం మహిళల(Women )అలసట గురించి మాత్రమే చెప్పడం కాదు..వారి మెదడు నిర్మాణంతో పాటు అది పనిచేసే తీరు వల్ల మహిళలకు మగవారి కంటే ఎ్కువ నిద్ర అవసరం అట. నిపుణులు తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం, మహిళలకు రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల అదనపు నిద్ర అవసరం. ఎందుకంటే, వారి మెదడు పగటిపూట చాలా బిజీగా ఉండి, రాత్రిపూట కోలుకోవడానికి (Recover) ఎక్కువ సమయం అడుగుతుందట.
చాలామంది మహిళలు ఒకే సమయంలో ఎన్నో పనులను నిర్వహించే మల్టీ టాస్కింగ్ స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల వారి మెదడు పురుషుల కంటే కూడా ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. పగటిపూట మెదడును ఎంత ఎక్కువగా వాడితే, అది తిరిగి కోలుకోవడానికి అంటే రికవరీ అవడానికి అంత ఎక్కువ నిద్ర అవసరమవుతుందట. అందుకే మహిళల మెదడుకు కాస్త ఎక్కువే విశ్రాంతి కావాలి.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే మహిళల్లో(Women )ఉండే హార్మోన్ల మార్పులు. పీరియడ్స్ సమయం, గర్భధారణ, మెనోపాజ్ వంటి దశల వల్ల కలిగే హార్మోన్ల హెచ్చుతగ్గులు వారి నిద్రపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల వారికి సరిగా నిద్ర పట్టదు. ఈ లోటును పూడ్చుకోవడానికి వారు ఇంకాస్త ఎక్కువ సమయం నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ఇంటి పనులు, ఆఫీసు పనులత పాటు పిల్లల బాధ్యతలను సమాంతరంగా చూసుకోవడం వల్ల కలిగే మానసిక, శారీరక అలసట కూడా ఎక్కువ నిద్ర కోరుకునేలా చేస్తుంది.

ఒకవేళ మహిళలు సరిపడా నిద్రపోకపోతే మగవాళ్ల కంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. తక్కువ నిద్ర వల్ల మహిళల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి, చిరాకు, మతిమరుపు, డిప్రెషన్ వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశముంది. అలాగే రక్తపోటు పెరగడం, గుండె సంబంధిత సమస్యలతో పాటు టైప్-2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నిద్ర లేకపోవడం వల్ల వారిలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.
కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢ నిద్ర అందరికీ అవసరమని మనకందరికీ తెలుసు. అయితే మహిళలు దానికంటే 20 నిమిషాల పాటు ఎక్కువ విశ్రాంతిని పొందినప్పుడు వారి మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. నిజానికి నిద్ర అనేది ఎవరికైన సరే విశ్రాంతి మాత్రమే కాదు, అది మెదడు తనను తాను రీఛార్జ్ చేసుకునే ప్రక్రియ. అందుకే మహిళలు కాస్త ఎక్కువ సమయం పడుకోడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ సమయం పడుకోడం అంటే అది బద్ధకం కాదు..మెదడు కోరుతున్న అత్యవసర అవసరమని గుర్తించాలి.



