Just LifestyleHealthLatest News

Mouth Taping:మౌత్ టేపింగ్ గురించి తెలుసా? ఏంటీ కొత్త ట్రెండ్?

Mouth Taping: ముక్కు కేవలం గాలి పీల్చడానికి మాత్రమే కాదు, ఆ గాలిని శుద్ధి చేయడానికి కూడా ముక్కు ఉపయోగపడుతుంది.

Mouth Taping

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్, ఎక్సర్‌సైజులు ఎంత ముఖ్యమో, మనం పీలుస్తున్న గాలి కూడా అంతే ముఖ్యం. అంతేకాదు ఆ పీల్చే గాలి కూడా ఎలా పీలుస్తున్నామనేది కూడా ఇంకా ఇంకా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది రాత్రిపూట తమకు తెలియకుండానే నిద్రలో నోటితో గాలి పీలుస్తుంటారు.

ఇలాంటివారి కోసమే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మౌత్ టేపింగ్(Mouth Taping) అనే ఒక కొత్త రకమైన ఆరోగ్య పద్ధతి ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. రాత్రి పడుకునేటప్పుడు నోటికి ఒక చిన్న ప్లాస్టర్ అంటే మెడికల్ టేప్ వేసుకుని, కేవలం ముక్కు ద్వారానే గాలి పీల్చేలా చేయడమే దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్. వినడానికి కొంచెం వింతగా ఉన్నా, దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

దీని కంటే ముందు అసలు ముక్కుతో గాలి పీల్చడం ఎందుకు ముఖ్యం అనే ప్రశ్న కనుక వేసుకుంటే.. ముక్కు కేవలం గాలి పీల్చడానికి మాత్రమే కాదు, ఆ గాలిని శుద్ధి చేయడానికి కూడా ముక్కు ఉపయోగపడుతుంది. ముక్కు ద్వారా గాలి పీల్చినప్పుడు ఆ గాలి వడకట్టబడి, శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారి మరీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది.

ముఖ్యంగా ముక్కు ద్వారా గాలిని పీల్చినప్పుడు బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజవుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరచడమే కాకుండా, మెదడుకు ఎక్కువ ఆక్సిజన్‌ను కూడా అందేలా చేస్తుంది. కానీ రాత్రులు పడుకున్న తర్వాత అలా నోటితో గాలి పీల్చడం వల్ల గొంతు ఎండిపోవడం వంటి ఇబ్బందితో పాటు నోటి దుర్వాసన, పళ్ల సమస్యలు, ముఖం ఆకృతిలో మార్పులు వంటివి వచ్చే అవకాశం ఉంది.

మౌత్ టేపింగ్(Mouth Taping) చేయడం వల్ల గురక సమస్య ఉన్నవారికి కూడా మంచిదే. ఇది గురకను తగ్గిస్తుంది. గాఢ నిద్ర పట్టడానికి ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. నిద్రలో నోరు మూసి ఉండటం వల్ల ఉదయం లేవగానే నోరు ఎండిపోయినట్లు ఉండదు. అలాగే, దీని వల్ల ముఖంలోని కండరాలు బిగుతుగా మారి, ముఖం ఆకృతి మెరుగుపడుతుందని సైన్స్ చెబుతోంది. అథ్లెట్లు కూడా ఇప్పుడు ఈ పద్ధతినే పాటిస్తున్నారట. దీనివల్ల నిద్ర లేచిన తర్వాత రోజంతా చాలా ఉత్సాహంగా, ఏకాగ్రతతో ఉండవచ్చని వారు దీనిని ఫాలో అవుతున్నారట.

Mouth Taping
Mouth Taping

ఈ పద్ధతిని పాటించే ముందు మాత్రం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. దీని కోసం సాధారణ సెల్లో టేపులు కాకుండా, స్కిన్‌కు ఎటువంటి హాని చేయని మెడికల్ టేపులను(Mouth Taping) మాత్రమే వాడాలి. అలాగే జలుబు చేసినప్పుడు లేదా ముక్కు బ్లాక్ అయినప్పుడు ఈ పద్ధతిని అస్సలు ఫాలో అవకూడదు.

అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారెవరయినా డాక్టర్ సలహా తీసుకున్నాకే దీనిని వాడాలి. దీనిని కొన్ని వారాల పాటు సరిగ్గా పాటిస్తే, కేవలం ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం అలవాటు అవుతుంది. ఈ చిన్న మార్పు మీ జీవితాన్నే మార్చేస్తుందని నిపుణులు అంటున్నారు

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button