Just PoliticalJust NationalLatest News

Women’s Reservation Bill : పార్లమెంట్‌లో మళ్లీ విమెన్స్ బిల్లు రచ్చ.. 40 ఓట్ల మేజిక్ ఫిగర్ ఎన్డీయేకి సాధ్యమేనా?

Women's Reservation Bill : నవంబరు 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎన్డీయే ముందున్న మెజారిటీ సమీకరణలు..

Women’s Reservation Bill

నవంబరు 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు స్వల్పకాలిక సమావేశాలు జాతీయ రాజకీయంలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ భేటీలలో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఎంతో కీలకమైన మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు(Women’s Reservation Bill)ను మోదీ సర్కార్ మళ్లీ సభ ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ చారిత్రక బిల్లు లోక్‌సభలో నెగ్గడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించడం ఎన్డీయే కూటమికి అతిపెద్ద సవాలుగా మారింది.

లోక్‌సభలో ప్రస్తుతం మొత్తం 540 మంది సభ్యులు ఉండగా, ముగ్గురు ఎంపీల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదాన్ని పొందాలంటే సభకు హాజరై ఓటు వేసే సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు తప్పనిసరి. సభలోని 540 మంది సభ్యులూ ఓటింగ్‌లో పాల్గొంటే బిల్లు నెగ్గడానికి కనీసం 360 మంది సపోర్ట్ అవసరం అవుతుంది.

అధికార ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 320 మంది ఎంపీల బలముంది. దీనిలో బీజేపీకి 241, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎన్‌సీపీఐ రెబల్స్ 20 మంది, శివసేన (షిండే) 13 మంది, టీడీపీ 16 మంది, జేడీయూ 12 మందితో పాటు ఎల్జేపీ-రామ్ విలాస్, ఆర్‌ఎల్‌డీ, జనసేన, జేడీఎస్ వంటి భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నాయి. ఇలాంటి భారీ నిర్మాణం ఉన్నా కూడా, మ్యాజిక్ ఫిగర్ 360ని అందుకోవడానికి మాత్రం ఎన్డీయేకు ఇంకా 40 ఓట్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్), వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలు బిల్లుకు సపోర్ట్ ఇచ్చినా లేదంటే ఓటింగ్‌కు గైర్హాజరైనా ఎన్డీయేకి ఇంకా ఓట్ల లోటు మిగిలే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో ఏప్రిల్ 17వ తేదీన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చినప్పుడు కూడా 54 ఓట్ల కొరతతో వీగిపోయింది. దీంతో ఈసారి ఎన్డీయే కూటమి విపక్ష సభ్యులను తమ వైపు తిప్పుకుంటుందా లేదా ఓటింగ్‌కు దూరం ఉంచి బిల్లును గట్టెక్కిస్తుందా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Meet A Stranger : సిటీలో స్ట్రేంజర్ మీట్, స్పీడ్ డేటింగ్ క్రేజ్..రీఫ్రెష్‌మెంట్ వెనుక రిస్క్‌లున్నాయా?

Related Articles

Back to top button