Just SportsLatest News

Pakistan : ఏంట్రా ఈ గలీజు పనులు ?..మహిళతో పాక్ క్రికెటర్ అసభ్యప్రవర్తన

Pakistan : పాక్ క్రికెటర్ హోటల్ సిబ్బందిలోని మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. శ్రీలంకతో సూపర్ 8 స్టేజ్ చివరి మ్యాచ్ కు ముందు రోజు కొలంబోలోని హోటల్ లో ఈ ఘటన జరిగింది

Pakistan

పాకిస్థాన్(Pakistan) క్రికెట్ జట్టు అంటేనే వివాదాలకు చిరునామా.. అటు మైదానంలోనూ, ఇటు బయట కూడా పనికిమాలిన వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. ప్రపంచకప్ లో చెత్త ప్రదర్శనతో సూపర్ 8లోనే ఇంటిదారి పట్టిన పాక్ జట్టుకు సంబంధించి ఓ వివాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ పాక్ క్రికెటర్ హోటల్ సిబ్బందిలోని మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. శ్రీలంకతో సూపర్ 8 స్టేజ్ చివరి మ్యాచ్ కు ముందు రోజు కొలంబోలోని హోటల్ లో ఈ ఘటన జరిగింది.

సదరు క్రికెటర్ అసభ్యంగా ప్రవర్తించగా ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో సహచర హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను కాపాడారు. దీనిని హోటల్ యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది. వెంటనే పాక్ టీమ్ మేనేజర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన పాక్ జట్టు తరపున క్షమాపణలు కోరాడు. అయితే హోటల్ మేనేజ్ మెంట్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా.. బ్రతిమాలి రాజీకి ఒప్పంచినట్టు కూడా తెలుస్తోంది.

సదరు ఆటగాడికి భారీ జరిమానా విధించి పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్టు హోటల్ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. పాక్ జట్టు మేనేజర్ ఈ విషయాన్ని బయటకు రాకుండా, ఆ క్రికెటర్ పేరును కూడా గోప్యంగా ఉంచినట్టు సమాచారం. మరోవైపు ఈ గలీజు పనికి పాల్పడ్డ క్రికెటర్ పై పాక్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pakistan
Pakistan

స్వదేశానికి చేరుకున్న తర్వాత పీసీబీ క్రమశిక్షణ కమిటీ ముందు అతను హాజరవ్వాలి. నిబంధనల ప్రకారం పీసీబీ అతనిపై కఠిన చర్యలు తీసుకుంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇలాంటి ప్రవర్తనను తాము అస్సలు సహించేది లేదని, పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసారంటూ పీసీబీలోని పలువురు సభ్యులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రపంచకప్ లో పాకిస్థాన్(Pakistan) సూపర్ 8 స్టేజ్ లోనే నిష్క్రమించింది.

న్యూజిలాండ్ తో మ్యాచ్ వర్షంతో రద్దవగా.. ఇంగ్లాండ్ పై పరాజయం పాలైంది. చివరి మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచిన రన్ రేట్ లేకపోవడంతో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. మెరుగైన రన్ రేట్ తో న్యూజిలాండ్ ముందంజ వేసింది. ఇక ప్రపంచకప్ వైఫల్యానికి పీసీబీ తమ జట్టుపై చర్యలకు సిద్ధమవుతోంది. పేలవ ఫామ్ కనబరిచిన ఆటగాళ్లకు పెద్ద మొత్తంతో జరిమానా విధించాలని భావిస్తోంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button