MPTC-ZPTC Elections : మారిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తేదీలు..నవంబర్ 7న ఫలితాలు
MPTC-ZPTC Elections : ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీల్లో రీషెడ్యూల్ జరిగింది. మున్సిపల్ ఫలితాల వల్ల నవంబర్ 5కి పోలింగ్ తేదీ మారింది.
MPTC-ZPTC Elections
ఏపీ రాజకీయాల్లో గ్రామీణ సమరానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ (MPTC-ZPTC Elections) డేట్స్‌ను సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ నవంబర్ 3వ తేదీన వెలువడనుండటంతో.. ఎన్నికల సిబ్బందికి , కౌంటింగ్ ప్రాసెస్‌కు ఎలాంటి ఇబ్బందులు కూడా రాకూడదనే ఉద్దేశంతో అధికారులు ఈ రీషెడ్యూల్ ప్లాన్ చేశారు. మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు(MPTC-ZPTC Elections) సజావుగా పూర్తి చేయొచ్చని ఎన్నికల అధికారులు భావించారు.
కొత్తగా జారీ చేసిన ఎన్నికల క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురై రీపోలింగ్ అవసరమైతే కనుక దానిని నవంబర్ 6వ తేదీన పూర్తి చేస్తారు. తుది లెక్కింపు అలాగే ఫలితాల వెల్లడి ప్రాసెస్‌ను నవంబర్ 7వ తేదీన చేపట్టి, అదే రోజు సాయంత్రానికి స్థానిక పోరు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఓటర్లు , రాజకీయ పార్టీలు ఈ మారిన డేట్స్ గమనించి తమ షెడ్యూళ్లను సద్దుబాటు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. మరోవైపు ఈ షెడ్యూల్ మార్పుతో గ్రామాల్లో కేండిడేట్స్ మైక్రో లెవెల్ క్యాంపెయినింగ్ మరింత ఊపందుకుంది.
Abhishek Sharma : జోరుమీదున్న అభిషేక్ శర్మ..మళ్లీ నెంబర్ 1 పీఠం కైవసం





