Just EntertainmentLatest News

Manchu : సుప్రీం తీర్పుతో మంచు ఫ్యామిలీకి ఊరట..ఏ కేసులోనో తెలుసా?

Manchu : విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన మంచు మోహన్‌బాబు, విష్ణులకు సుప్రీంకోర్టు ఊరట. 2019 కేసు కొట్టేసిన తీర్పు రాజకీయంగా మద్దతుగా మారింది.

Manchu

2019లో విద్యార్థుల న్యాయమైన డిమాండ్ కోసం రోడ్డెక్కిన సినీ నటులు మంచు మోహన్‌బాబు(Mohan Babu), ఆయన కుమారుడు మంచు విష్ణు (Manchu Vishnu)..ఐదేళ్లపాటు న్యాయపోరాటం చేసి గెలిచారు. గతంలో ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసును సుప్రీంకోర్టు గురువారం పూర్తిగా కొట్టేయడం పెద్ద ఊరటగా మారింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై విద్యార్థులకు న్యాయం కలగాలని కోరుతూ 2019లో తిరుపతిలో నిర్వహించిన ర్యాలీ, ఐదు సంవత్సరాల పాటు కేసుల పేరుతో ఈ కుటుంబాన్ని వెంటాడింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, ట్రాఫిక్ డిస్టర్బెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ అంటూ అప్పట్లో అమల్లో ఉన్న అధికారుల తీరు ఒక ప్రభుత్వ దమన విధానాన్ని ప్రతిబింబించింది. కానీ చివరకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అది కేవలం నిరాధారమైన కేసు అని తేలిపోయింది.

ఆనాడు మార్చి 22న శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థ నుంచి విద్యార్థులు, సిబ్బంది, నేతలు కలిసి చేపట్టిన ర్యాలీ, తిరుపతి – మదనపల్లె రోడ్డుపై సాగింది. శాంతియుతంగా సాగిన ఆ ప్రదర్శన, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిందంటూ పోలీసులు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులోని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఛార్జ్‌షీట్‌లు చదివితే, అసలు అభియోగాలు వాళ్లపై ఎందుకు వర్తిస్తాయోనే అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం.

manchu
manchu

ఎలక్షన్ కోడ్‌అంటే ప్రభుత్వ యంత్రాంగానికి చట్టం కంటే ముందే మార్గదర్శకమైపోయింది అన్న అభిప్రాయాన్ని ఈ కేసు బలపరుస్తోంది. హైకోర్టులో తొలుత క్వాష్ పిటిషన్ తిరస్కరించబడగా, Manchu మోహన్‌బాబు, విష్ణు మళ్లీ సుప్రీంకోర్టు శరణు తీసుకున్నారు. మార్చి 3న దాఖలైన అప్పీల్‌పై వాదనలు జూలై 22న ముగిశాయి. తాజాగా పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టిన ఆధారాలేదని కోర్టు వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టేయడంతో ఇది రాజకీయంగా కూడా మంచు ఫ్యామిలీకి మద్దతుగా నిలిచింది.

Also Read: Cinema : వీడెక్కడి నటుడండీ ..దక్షిణాది సినిమా భవిష్యత్తులా ఉన్నాడే..!

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button