Just InternationalJust Political

Trump:సుప్రీంకోర్టుకు ట్రంప్ చెక్.. దిగుమతి సుంకాలపై సరికొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Trump: ట్రంప్ ప్రభుత్వం 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301ను తిరిగి ఇప్పుడు ప్రయోగించాలని ఆలోచిస్తోంది.

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..మరోసారి తన ఆర్థిక ప్రణాళికలను అమలు చేసే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో సుమారు 1.6 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 133 లక్షల కోట్లు ఆదాయానికి గండిపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ సరికొత్త కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసినా సరే, చట్టపరమైన మార్గాల ద్వారా దిగుమతి సుంకాలను మళ్లీ అమలులోకి తీసుకురావాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించుకున్నట్లు వాషింగ్టన్ వర్గాల నుంచి అందిన సమాచారంగా తెలుస్తోంది.

గతేడాది ఆర్థిక లోటును అధిగమించడానికి ట్రంప్(Trump) ప్రభుత్వం దిగుమతి సుంకాలను భారీగా పెంచిన విషయం కూడా తెలిసిందే. అయితే, ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు దీనిపై కీలక తీర్పునిస్తూ.. అత్యవసర అధికారాల పేరుతో ప్రభుత్వం విధించిన కొన్ని దిగుమతి సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని ట్రంప్ వర్గానికి మొట్టికాయలు వేసింది.

Trump
Trump

అయితే ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఆశించిన భారీ ఆదాయం నిలిచిపోయినట్లు అయింది. దీంతో ఈ ఆదాయమే కనుక లేకపోతే ప్రజలకు ఇస్తున్న ట్యాక్స్ మినహాయింపులను కొనసాగించడం కష్టమవుతుంది. దీని వల్ల దేశ ఆర్థిక లోటు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్ (Trump) ప్రభుత్వం 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301ను తిరిగి ఇప్పుడు ప్రయోగించాలని ఆలోచిస్తోంది. ఈ విధానం ద్వారా టారిఫ్‌లు విధించడం కొంత సంక్లిష్టమైన ప్రక్రియ అయినా సరే, ఇది చట్టబద్ధమైన మార్గం కావడంతో దీనికే ట్రంప్ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇలా అమెరికా వాణిజ్య విధానంలో రాబోయే రోజుల్లో చోటుచేసుకోబోతున్న ఈ మార్పులు, అంతర్జాతీయ వాణిజ్య రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button