Just TelanganaLatest News

CS : వేడెక్కిన సీఎస్ రేసు.. రేవంత్ ఓటు వారికేనా?

CS : తెలంగాణలో కొత్త సీఎస్ ఎంపికపై ఉత్కంఠ. కేఆర్కే పదవీకాలం ముగిసే వేళ.. రేవంత్ రెడ్డి నిర్ణయంపై అధికార వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

CS

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇప్పుడు కౌంట్‌డౌన్ మొదలైంది. కానీ ఇది ఓ ఎన్నికల కౌంట్‌డౌన్ కాదు… ప్రభుత్వంలోనే అత్యంత కీలక పదవిగా భావించే చీఫ్ సెక్రటరీ Chief Secretary (CS)పీఠం కోసం. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు (కేఆర్కే) పదవీకాలం ఆగస్టు నెలాఖరుతో ముగియనుంది. ఇక ఆయనకు మరోసారి పొడిగింపు వచ్చేదేమీ లేదు. కేంద్రం, డీఓపిటి ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్టే ..రూల్ వన్ ఫర్ ఆల్.

ఇదే విషయంపై తెలంగాణలో అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎవరికి సీఎస్ అవకాశం వస్తుందా? ఎవరి మద్దతు ఎక్కువగా ఉంది? ఎవరి వంతు వచ్చింది? అనే ఉత్కంఠ నెలకొంది.

రేవంత్ రెడ్డి పాలనలో ఒక విషయం మాత్రం ఇప్పటిదాకా క్లియర్‌గా కనిపించింది . అందరికీ న్యాయం చేయాలి. పదవి కోసం పరుగులు పెట్టేవారికీ, పదవిలో ఉండి పని చూపించేవారికీ ఒకే స్థాయిలో ట్రీట్‌మెంట్. ఇదే ఆయన స్టైల్ అన్న విషయం అయితే పార్టీ వర్గాలకు రీచయింది.

గతంలో శరత్ పేరును ఈ రేసులో ముందుగా వినిపించినా… అవన్నీ కాళ్లు మొక్కే ప్రయత్నంగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఐఏఎస్ వెంకట్రావు(Venkatrao IAS)పేరు వినిపిస్తున్నా… రేవంత్ రెడ్డి తిరిగి అదే స్ట్రాటజీకి తలొగ్గుతారన్న గ్యారంటీ లేదు.

telangana-Chief-Secretary-cs
telangana-Chief-Secretary-cs

కేఆర్కే పదవీకాలం దగ్గరపడుతున్నా కూడా రేవంత్ రెడ్డి వైఖరి ఏమీ మారలేదు. ఆయన తీరు చూసినవారికి ఇప్పుడో స్పష్టత కలిగింది . పదవిని ఎవరైనా పొందవచ్చు. కానీ దాన్ని పటిష్టంగా నిలుపుకోవడానికి పరిపక్వత, ప్రజలపై బాధ్యతాభావం, ముఖ్యమంత్రిపై నమ్మకం కావాలి అన్నది తేలింది.

ఇటు సీఎస్ స్థాయి ఉద్యోగులలో ఇప్పుడు ‘సైలెంట్ వార్’ మొదలైపోయింది. ప్రతీ ఒక్కరూ తమ పోర్ట్‌ఫోలియో మెరుగుపరిచేలా చూసుకుంటున్నారు. బోయినపల్లి నుంచి బేగంపేట వరకు సర్కారు అధికార భవనాల్లో ఈ ఒక్కటే టాపిక్.. సీఎ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎవరిని సీఎస్‌గా నిలబెడతారు?” ఈ ప్రశ్నకు సమాధానం తేలాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: Rahul Gandhi: ఓటు వేటలో ఈసీ ఆటలు .. రాహుల్ మాటల్లో నిజాలున్నాయా?

Manchu : సుప్రీం తీర్పుతో మంచు ఫ్యామిలీకి ఊరట..ఏ కేసులోనో తెలుసా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button