Just SportsLatest News

Sanju Samson : సంజూ స్థానాన్ని భర్తీ చేయలేం..ఈ సీజన్ సవాలేనన్న రియాన్ పరాగ్

Sanju Samson : ఐపీఎల్ 2026 సీజన్ కు ఇంకా వారం రోజులే మిగిలిఉంది. దీంతో అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మినీ వేలం తర్వాత చాలా జట్ల కూర్పు మారిపోయింది

Sanju Samson

ఐపీఎల్ 2026 సీజన్ కు ఇంకా వారం రోజులే మిగిలిఉంది. దీంతో అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మినీ వేలం తర్వాత చాలా జట్ల కూర్పు మారిపోయింది. కెప్టెన్లు కూడా మారారు. రాజస్థాన్ రాయల్స్ కు రియాన్ పరాగ్ సారథ్యం వహించబోతున్నాడు. గత సీజన్ లో సంజూ లేనప్పుడు కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన రియాన్ పరాగ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో పగ్గాలు అందుకున్నాడు.

సంజూ శాంసన్(Sanju Samson) చెన్నైకి ట్రేడింగ్ లో వెళ్లిపోవడంతో పరాగ్ కు కెప్టెన్సీ దక్కింది. కాగా కొత్త సీజన్ కోసం సన్నద్ధమవుతున్న వేళ రియాన్ పరాగ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సంజూ శాంసన్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ జట్టులో సంజూ స్థానాన్ని భర్తీ చేయలేమన్నాడు. రోహిత్ , కోహ్లీలను ఎలా రీప్లేస్ చేయలేమో, సంజూ శాంసన్ ప్లేస్ ను కూడా భర్తీ చేయడం సాధ్యం కాదన్నాడు.

అందుకే తాము ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆలోచన కాకుండా అక్కడ దూకుడుగా ఆడే బ్యాటర్ కోసమే ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. కెప్టెన్సీ అంత ఈజీ కాదనీ, అయితే ఈ సవాల్ కు తాను సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించాడు.

అలాగే గత సీజన్ లో రాజస్థాన్ ఆటతీరుపైనా, ప్రస్తుతం జట్టు కూర్పుకు సంబంధించి కూడా రియాన్ పరాగ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సీజన్ లో పక్కా ప్రణాళికతో ఆడబోతున్నట్టు చెప్పాడు. విజయాలతో ఎక్కువ మ్యాచ్ లను ముగించడంపైనే దృష్టి సారించినట్టు తెలిపాడు. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ చాలా మ్యాచ్ లను కొద్దిపాటి తేడాతో కోల్పోయింది.

Sanju Samson
Sanju Samson

దీంతో ఈ సారి అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తంది. పరాగ్ తో పాటు మాట్లాడిన సంగక్కర కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. గత సీజన్ లో చేజేతులా కొన్ని మ్యాచ్ లలో ఓడిపోయామని, అవి గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉండేదన్నాడు. ఈ సారి అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్నామని, ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటామన్నాడు.

రవీంద్ర జడేజా తమ మ్యాచ్ విన్నర్ గా నిలుస్తాడని సంగక్కరా ధీమా వ్యక్తం చేశాడు. మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్రేడింగ్ జరిగింది. ఈ డీల్ ద్వారా సంజూ శాంసన్ ను(Sanju Samson) వదులుకున్న రాజస్థాన్ అతనికి బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కరన్ లను తీసుకుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button