IPL : ఇదే చివరి సీజన్ కానుందాా ?..స్టార్ ప్లేయర్స్ రిటైర్మెంట్ పై వార్తలు
IPL : ఐపీఎల్ 19వ సీజన్ ముంగిట మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ రిటైర్మెంట్ పై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి
IPL
ఐపీఎల్ 19వ సీజన్ ముంగిట మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ రిటైర్మెంట్ పై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు మహేంద్రసింగ్ ధోనీనే. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా గుర్తింపున్న ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చని భావిస్తున్నారు. నిజానికి గత కొన్ని సీజన్లుగా ధోనీ ఐపీఎల్(IPL) రిటైర్మెంట్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఎప్పటికప్పుడు ఈ దిగ్గజ ఆటగాడు వాటిని తోసిపుచ్చుతూనే ఉన్నాడు.అయినాసరే ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే గత సీజన్ నుంచి ధోనీ మునుపటిలా రాణించడం లేదు. మోకాలి సర్జరీ తర్వాత ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగానే గత కొన్ని సీజన్లుగా ధోనీ వారసుడిని వెతికే పనిలో చెన్నై బిజీగా ఉంది. జ
డేజా తర్వాత రుతురాజ్ ను కెప్టెన్ గా కొనసాగించింది. సంజూ శాంసన్ ఎంట్రీతో అతన్ని ఫ్యూచర్ కెప్టెన్ గా చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో 45వ ఏట అడుగుపెట్టనున్న ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత సీఎస్కే మెంటార్ గా కొనసాగే అవకాశముంది.
ధోనీ తర్వాత రిటైర్మెంట్ ప్లేయర్స్ జాబితాలో సునీల్ నరైన్ పేరు వినిపిస్తోంది. 2026 సీజన్ అతని కెరీర్ లో చివరిది కానుందని తెలుస్తోంది. సుధీర్ఘ కాలంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టులో కీలక స్పిన్నర్ గా ఎదిగిన నరైన్ ఆల్ రౌండర్ గానూ రాణించాడు. బంతితో 192 వికెట్లు, బ్యాట్ తో 1780 పరుగులు చేసిన నరైన్ 38 ఏళ్లకు చేరువవుతున్నాడు.

ఫిట్ నెస్ సమస్యల దృష్ట్యా ఐపీఎల్ కు ఆటగాడిగా వీడ్కోలు పలికే అవకాశముంది. ఇదిలా ఉంటే భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఐపీఎల్ కెరీర్ ముగించేందుకు చేరువలో ఉన్నాడు. 37 ఏళ్ల ఈ ఢిల్లీ పేసర్ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. యువ పేసర్ల నుంచి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇక కెరీర్ కొనసాగించడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ సీజన్ తర్వాత ఇషాంత్ ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడని భావిస్తున్నారు.
ఇక కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కెరీర్ కూడా చరమాంకంలో ఉంది. గత సీజన్ నుంచి కేకేఆర్ కు సారథిగా వ్యవహరిస్తున్న రహానేను ఆ ఫ్రాంచైజీ భవిష్యత్తులో కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. అటు గత రెండు సీజన్ల నుంచి దూకుడుగానే ఆడుతున్నాకూడా 38 ఏళ్లకు చేరువలో ఉన్న రహానే తన ఫిట్ నెస్ , ఫామ్ కంటిన్యూ చేయడం కష్టమే.
Ustaad Bhagat Singh:ఉస్తాద్‌కు అడ్డం పడుతున్న ధురంధర్.. వీకెండ్ కింగ్ ఎవరు?





