Just EntertainmentLatest News

Renu Desai:ధురంధర్ 2 మూవీపై రేణు దేశాయ్ క్రేజీ రివ్యూ.. మోదీపై హాట్ కామెంట్స్

Renu Desai: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని రేణు దేశాయ్ స్పష్టం చేసినా, ఇలాంటి పోస్టులు పెట్టడం ద్వారా తన పొలిటికల్ స్టాండ్ ఏంటో మరోసారి నిరూపించుకున్నట్లు అయింది.

Renu Desai

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా పంచుకుంటూ వస్తోన్న రేణు దేశాయ్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్న ధురంధర్ 2 సినిమాను చూసిన ఆమె, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయల మైలురాయిని దాటి ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఈ మూవీ చూసిన తర్వాత దేశభక్తితో ఉప్పొంగిపోయిన రేణు దేశాయ్(Renu Desai), భారత్ గురించి తక్కువ చేసి మాట్లాడే వారంతా కచ్చితంగా ఈ మూవీ చూడాలని తన పోస్ట్‌లో అన్నారు. మన సైనికులు చేస్తున్న త్యాగాల వల్లే మనమంతా ఇళ్లలో ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని రేణుదేశాయ్ గుర్తు చేశారు.

ఈ సందర్భంగా రేణు దేశాయ్(Renu Desai) భగవద్గీతలోని శ్లోకాలను ఉటంకిస్తూ.. ధర్మాన్ని పాటించడమే మన కర్తవ్యమని, రిజల్ట్ గురించి ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు. అయితే ఈ పోస్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్య విషయం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆమె కురిపించిన ప్రశంసలు.

Renu Desai
Renu Desai

మూవీలో దావూద్ ఇబ్రహీం రోల్ చెప్పే ఒక డైలాగ్‌ను రీల్ రూపంలో షేర్ చేస్తూ, ఆ ‘చాయ్‌వాలా జల్వా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తాను బీజేపీకి, ప్రధానమంత్రి మోదీకి పెద్ద అభిమానిని అని, ఇంకా చెప్పాలంటే తానొక ‘అంధభక్తురాలిని’ అని ఆమె బహిరంగంగా చెప్పారు. అయితే గతంలో కూడా కొన్ని ఇంటర్వ్యూలలో తనకు బీజేపీ సిద్ధాంతాలన్నా, మోదీ అన్నా ఎంతో ఇష్టమని రేణు చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని అప్పుడే రేణు దేశాయ్ స్పష్టం చేసినా, ఇలాంటి పోస్టులు పెట్టడం ద్వారా తన పొలిటికల్ స్టాండ్ ఏంటో మరోసారి నిరూపించుకున్నట్లు అయింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం, ఇలాంటి సమయంలోనే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా రేణు పోస్ట్‌పై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ‘ధురంధర్ 2’ మూవీ ఇచ్చిన జోష్‌తో రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్.. ఇప్పుడు ఫిల్మ్ నగర్ టు పొలిటికల్ వర్గాల వరకు హాట్ టాపిక్‌గా మారాయి.

Coconut Water:కొబ్బరి నీళ్లు అమృతమా.. విషమా? నిపుణులు ఏమంటున్నారు?

Related Articles

Back to top button