Just SportsLatest News

IPL : రూ.1000 కోట్లు దాటేసిందిగా…ఐపీఎల్ టీమ్స్ స్పాన్సర్ షిప్ ఆదాయం

IPL : ఐపీఎల్ అంటేనే బిజినెస్... బీసీసీఐకి బంగారు బాతు.. కేవలం బోర్డుకే కాదు ఫ్రాంచైజీలకు కూడా భారీగా కాసులు కురిపించే లీగ్ ఇది..

IPL

ఐపీఎల్ అంటేనే బిజినెస్… బీసీసీఐకి బంగారు బాతు.. కేవలం బోర్డుకే కాదు ఫ్రాంచైజీలకు కూడా భారీగా కాసులు కురిపించే లీగ్ ఇది.. అభిమానులకు వినోదాన్ని ఇస్తూనే ఫ్రాంచైజీలకు, ఆటగాళ్ళకు కోట్లాది రూపాయలు కురిపిస్తోంది. తాజాగా 2025 సీజన్ కు సంబంధించి ఫ్రాంచైజీలు జాక్ పాట్ కొట్టాయి.

టీమ్స్ స్పాన్సర్ షిప్ ఆదాయం ఏకంగా రూ.1000 కోట్లు దాటింది. లీగ్ చరిత్రలో స్పాన్సర్ షిప్ రెవెన్యూ వెయ్యి కోట్లు దాటడం ఇదే తొలిసారి. డబ్ల్యూపీపీ మీడియా ఇచ్చిన స్పోర్టింగ్ నేషన్ నివేదిక ప్రకారం 2025 సీజన్ లో 10 ఫ్రాంచైజీలు కలిపి రూ.1033 కోట్లు స్పాన్సర్ షిప్ ద్వారా ఆర్జించినట్టు తెలుస్తోంది.

ఈ జాబితాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మూడు టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 3లో నిలిచాయి. నివేదిక ప్రకారం ఒక్కొక్కటి రూ.150 కోట్ల ఆదాయాన్ని పొందాయి. మిగిలిన ఏడు ఫ్రాంచైజీలు కలిపి రూ. 583 కోట్ల వరకూ ఆర్జించాయి. ఈ జాబితాలో కోల్ కత్తా నైట్ రైడర్స్ , గుజరాత్ టైటాన్స్ 4,5 స్థానాల్లో నిలిచాయని తెలిపింది.

కరోనా తర్వాత చాలా రంగాలు ఆర్థికంగా ప్రభావితమైనా సరే ఐపీఎల్(IPL) బ్రాండ్ వాల్యూ మాత్రం చెక్కు చెదరలేదు. అయితే దేశంలో కొత్తగా తీసుకొచ్చిన గేమింగ్ చట్టంతో డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్ షిప్ ఒప్పందం నుంచి తప్పుకోవడం కాస్త నష్టాన్ని కలిగించినా ఓవరాల్ గా మాత్రం గత సీజన్ లో అన్ని ఫ్రాంచైజీలు మంచి లాభాలనే చూసాయి.

IPL
IPL

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ ఉన్న ఐపీఎల్ లో భాగమయ్యేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. గత కొంతకాలంగా మీడియా, డిజిటల్ హక్కులు సైతం రికార్డు స్థాయిలో అమ్ముడవడం ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం. ఇదిలా ఉంటే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ తో పోలిస్తే ఆదాయపరంగా వెనుకబడినప్పటికీ మ్యాచ్ కు వచ్చే మీడియా హక్కుల విలువలో మాత్రం ఐపీఎల్ దే పైచేయిగా నిలిచింది.

కాగా ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు పలు రూపాల్లో ఆదాయం వస్తుంది. మీడియా హక్కులు, లీగ్ సెంట్రల్ స్పాన్సర్ షిప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంచుతుంది. కేవలం మీడియా హక్కుల అమ్మకం ద్వారానే ఒక్కో ఫ్రాంచైజీకి రూ.500 కోట్ల వరకూ ఆదాయం దక్కుతోంది. అలాగే టీమ్స్ స్పాన్సర్ షిప్ ద్వారా రూ.150 కోట్లు, మ్యాచ్ డే రెవెన్యూ అంటే టికెట్ సేల్స్ , స్టేడియాల్లో బ్రాండింగ్ , మర్చండైజ్ వంటి వాటితో 10 శాతం వరకూ ఆదాయం వస్తుంది.

IPL : 15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు..తెలుగు రాష్ట్రంలో ఎక్కడో తెలుసా ?

Related Articles

Back to top button