HealthLatest News

Vitamin D3 : విటమిన్ D3 లోపమా..?…ఈ ఆహారాలతో మీ సమస్య ఖతం..

Vitamin D3 : మీ శరీరంలో విటమిన్ D3 లోపం ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిని పరిష్కరించడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి

Vitamin D3

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన పోషకాలు అందడం కష్టమే అవుతోంది. విటమిన్ లోపాలతో చాలా మంది సతమతమవుతున్నారు. ముఖ్యంగా డి3 లోపం సమస్యగా మారింది. తరచుగా అలసిపోయినట్టు అనిపించడం విటమిన్ డి3 లోపం యొక్క ప్రధాన లక్షణం. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు.

ఈ లోపాన్ని అధిగమించడానికి కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే విటమిన్ డి3(Vitamin D3) లోపం దరిచేరదని చెబుతున్నారు. విటమిన్ డి శరీరంలో చాలా ఈజీగా కరిగిపోయే విటమిన్‌లలో ఒకటి. ఇది ఎముకలను బలంగా చేయడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అలసటను తగ్గించడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ డి పొందడానికి చాలా సులభమైన మార్గం సూర్యరశ్మిలో ఉండడమే. అదే సమయంలో కొన్ని ఆహారాల ద్వారా కూడా ఈ విటమిన్ అందుతుంది.

* విటమిన్ డి3(Vitamin D3) ఎక్కువగా ఉండే ఆహారాల్లో చేపలను ముఖ్యంగా చెప్పొచ్చు. ట్యూనాతో పాటు మాకెరిల్, సార్డిన్, సాల్మన్ వంటి చేపల్లో విటమిన్ డి3 అధికంగా లభిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే చేపలను రోజువారీ ఆహారంలో తీసుకోమని వైద్యులు ఖచ్చితంగా సూచిస్తుంటారు.

Vitamin D3
Vitamin D3

* గుడ్డుపచ్చసొనను వృథా చేయకుండా తింటే విటమిన్ డి అందుతుంది. రెండు గుడ్లలో సుమారుగా 82 ఐయూ విటమిన్ డి ఉంటుంది.

* రోజువారీ ఆహారాల్లో విటమిన్ డి3 బాగా దొరికేవి పాల ఉత్పత్తులే. పాలు, సోయా లేదా బాదం పాలు , నారింజ రసం వంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

* కూరగాయల్లో పుట్టగొడుగులు విటమిన్ డికి పొందేందుకు మంచి ఆప్షన్.
సూర్యకాంతికి గురైన పుట్టగొడుగులలో విటమిన్ D3 కూడా ఉంటుంది. పుట్టగొడుగులను ఇతర కూరగాయలతో కలిపి వండుకుని భోజనంలో తీసుకోవచ్చు.

* కొన్ని రకాల జున్ను, వెన్న, దేశీయ నెయ్యిలో కూడా విటమిన్ డి3 పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే విటమిన్ డి3 లోపం దరిచేరే అవకాశాలు ఉండవు.

Rajasthan Royals : రూ.15 వేల కోట్లతో డీల్చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

Related Articles

Back to top button