Dubai : దుబాయ్ సామ్రాజ్యం ఢమాల్…ఇరాన్ దెబ్బ మామూలుగా లేదుగా
Dubai : అమెరికా-ఇరాన్ యుద్ధం దుబాయ్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తోంది. దుబాయ్ సంస్కృతిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇరాన్ అక్కడి క్లబ్ లు, మద్యం, వ్యభిచారం వంటి వాటిని పూర్తిగా లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది
Dubai
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది దుబాయ్… ఇక్కడ దొరకనిది అంటూ ఏం లేదు. ఇతర దేశాలకు చెందిన చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టి, స్థిర నివాసం కూడా ఏర్పరుచుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా కూడా చెబుతుంటారు. అన్నింటికీ మించి దుబాయ్ భద్రతకు మారుపేరు. లగ్జరీగా బతకాలంటే చాలా మంది సంపన్నులు చూసేది దుబాయ్ వైపే. అలాంటి దేశం ఇప్పుడు ఉలిక్కిపడుతోంది.
అమెరికా-ఇరాన్ యుద్ధం దుబాయ్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తోంది. దుబాయ్ సంస్కృతిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇరాన్ అక్కడి క్లబ్ లు, మద్యం, వ్యభిచారం వంటి వాటిని పూర్తిగా లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. అసలు ఈ అరబ్ దేశంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహానికి ముఖ్య కారణం అమెరికా, ఇజ్రాయిల్ కు మద్ధతివ్వడమే.
అది కూడా ఆ రెండు దేశాలు తమపై దాడులు చేసేందుకు యూఏఈనే వాడుకుంటున్నాయన్నది ఇరాన్ ఆరోపణ. దుబాయ్ కి సమీపంలో ఉన్న స్థావరాల నుంచే తమపై దాడులు జరుగుతున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ దాడులు చేసేందుకు స్థావరాలను ఇస్తూ సహకరించే ఏ దేశాన్ని అయినా తాము శతృవుగా భావిస్తామని ఇప్పటికే పలుసార్లు తీవ్రంగా హెచ్చరించింది. అయినా కూడా యూఏఈ ఖాతరు చేయకపోవడంతో ఇరాన్ అరబ్ దేశాలను టార్గెట్ చేసింది.
ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లతో దుబాయ్ పై దాడులు చేస్తోంది.. ఇప్పటివరకు 1,800 పైగా డ్రోన్లు, 350 పైగా బాలిస్టిక్ మిసైళ్లను ఆ దేశంపై ప్రయోగించింది. ఒకప్పుడు అత్యంత సురక్షితమైన నగరంగా భావించే దుబాయ్ అంటే ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే మార్చి 15న జరిగిన దాడులు అక్కడి పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపాయి.
దుబాయ్ కే తలమానికంగా ఉంటే ఐకానిక్ హోటల్ బుర్జ్ అల్ అరబ్, జెబెల్ అలీ పోర్ట్, దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన పేలుళ్లు పర్యాటకులను భయభ్రాంతులకు గురి చేశాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇంధన ట్యాంకర్లపై కూడా డ్రోన్ దాడి జరగడంతో విమాన సర్వీసులు కూడా నిలిపివేయాల్సి వచ్చింది.

మరోవైపు దుబాయ్ సంస్కృతిపైనా ఇరాన్ కు తీవ్ర అసంతృప్తి ఉంది. ఇరాన్ ఒక కఠినమైన ఇస్లామిక్ చట్టాలు ఉన్న దేశం. దుబాయ్‌లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంటుంది. వెస్ట్రన్ కల్చర్, పబ్లిక్ క్లబ్‌లు, మద్యం వంటివి ఇరాన్ సాంప్రదాయాలకు విరుద్ధమని వారు భావిస్తున్నారు. దీంతో ఇస్లాం సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న దుబాయ్ కల్చర్ ను పూర్తిగా తుడిచిపెట్టేవిధంగా ప్రయత్నాలు చేస్తోంది.
దీని కోసం ప్రస్తుత యుద్ధపరిస్థితులను వాడుకుంటోంది. ఇక యుద్ధ వాతావరణ పరిస్థితులతో దుబాయ్ టూరిజం కుప్పకూలింది. దాదాపు 70 శాతం ఆదాయం పడిపోయింది. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ రావడం లేదు. ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు సైతం వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో దుబాయ్ మళ్లీ కోలుకోవడం ఇప్పట్లో కష్టమేనని భావిస్తున్నారు.
Sri Rama Navami : శ్రీరామ నవమి విశిష్టత…ఇలా చేస్తే ఇంట్లో సిరిసంపదలే





