Lucknow Super Giants : సన్ రైజర్స్ కు షాక్…లక్నో చేతిలో చిత్తు
Lucknow Super Giants : భీకరమైన బ్యాటింగ్ లైనప్...300 ప్లస్ ఖాయం.. సొంతగడ్డపై తిరుగులేదు.. ఇదీ సన్ రైజర్స్ హైదరాబాద్ పై వినిపించే అభిప్రాయం..కట్ చేస్తే ఆదివారం హోంగ్రౌండ్ లో సీన్ రివర్స్ అయింది
Lucknow Super Giants
భీకరమైన బ్యాటింగ్ లైనప్…300 ప్లస్ ఖాయం.. సొంతగడ్డపై తిరుగులేదు.. ఇదీ సన్ రైజర్స్ హైదరాబాద్ పై వినిపించే అభిప్రాయం..కట్ చేస్తే ఆదివారం హోంగ్రౌండ్ లో సీన్ రివర్స్ అయింది. తమ పాత బౌలర్ షమీ దెబ్బకు సన్ రైజర్స్ టాపార్డర్ కుప్పకూలింది…నితీశ్ , క్లాసెన్ పోరాటంతో ఓ మాదిరి స్కోరు చేసినా సరే మార్కరమ్ , పంత్ మెరుపులతో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సన్ రైజర్స్ ను చిత్తు చేసి తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ భారీ స్కోరు చేస్తుందని అభిమానులు ఎంతో ఆశగా స్టేడియానికి తరలివచ్చారు. తీరా చూస్తే ఓపెనర్లతో పాటు టాపార్డర్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. షమీ ధాటికి టాపార్డర్ క్రీజులో నిలవలేకపోయింది.
హెడ్ (7), అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్ (1) , లివింగ్ స్టోన్ (14) పరుగులకే ఔటయ్యారు. ఫలితంగా సన్ రైజర్స్ పవర్ ప్లేలో అత్యంత తక్కువ పరుగులు చేసింది. కేవలం 26 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది.అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీయడం ద్వారా సన్ రైజర్స్ కు పెద్ద దెబ్బ కొట్టాడు. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ సన్ రైజర్స్ ను ఆదుకున్నారు.
వీరిద్దరూ ఆరంభంలో నిదానంగా ఆడినా 10 ఓవర్ల తర్వాత గేర్ మార్చారు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ పెంచారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 17 ఓవర్ల వరకూ క్రీజులో ఉన్న నితీశ్ , క్లాసెన్ మరింత వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి 33 బంతుల్లో 56 (3 ఫోర్లు, 5 సిక్సర్లు), క్లాసెన్ 41 బంతుల్లో 62 ( 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యారు. డెత్ ఓవర్స్ లో లక్నో బౌలర్లు పుంజుకోవడంతో హైదరాబాద్ 156 పరుగులే చేయగలిగింది. సాధారణంగా ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈసారి ఫాస్ట్ బౌలర్లు స్లో బాల్స్ వేస్తుంటే బ్యాటర్లు ఇబ్బంది పడడం కనిపించింది.

దీంతో సన్ రైజర్స్ బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అనుకున్నారు. అయితే మిఛెల్ మార్ష్ (14 ) త్వరగానే ఔటైనా, మార్కరమ్, రిషబ్ పంత్ అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టారు. ఫలితంగా లక్ష్యఛేదనలో లక్నోకు పెద్ద ఇబ్బందులేమీ ఎదురుకాలేదు. అయితే చివర్లో మార్కరమ్ 27 బంతుల్లో 45 (6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటైన తర్వాత లక్నో వరుస వికెట్లు కోల్పోయింది. బదోని (12), పూరన్ (1), సమద్ (16) పరుగులకు ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ఈ దశలో రిషబ్ పంత్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లక్నో కెప్టెన్ చివరి ఓవర్లో మ్యాచ్ ను ముగించాడు. దీంతో లక్నో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు ఇది రెండో ఓటమి. అటు లక్నోకు(Lucknow Super Giants) ఇదే తొలి విజయం.
CSK vs RCB : చెన్నై గెలుపు రుచి చూసేనా ?…ఆర్సీబీతో హై వోల్టేజ్ ఫైట్





