Just InternationalJust PoliticalLatest News

Dubai : గల్ఫ్‌ దేశాలపై యుద్ధం దెబ్బ…దుబాయ్‌ను దెబ్బ కొట్టిన ట్రంప్‌

Dubai : హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ మీద పడినట్టు అమెరికా-ఇరాన్‌ యుద్ధం గల్ఫ్‌ దేశాలను ముంచేసింది.మొన్నటి వరకూ రియల్ ఎస్టేట్‌లో టాప్ లో ఉన్న దుబాయ్ ఇప్పుడు పాతాళానికి పడిపోయింది

Dubai

హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ మీద పడినట్టు అమెరికా-ఇరాన్‌ యుద్ధం గల్ఫ్‌ దేశాలను ముంచేసింది.మొన్నటి వరకూ రియల్ ఎస్టేట్‌లో టాప్ లో ఉన్న దుబాయ్(Dubai) ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. అక్కడ విల్లాలు కొనేందుకు ఎగబడిన వారంతా అటువైపే చూడడం లేదు.

ఇప్పటికే కొన్నవారంతా అమ్మేసేందుకు ప్రయత్నిస్తుంటే కొనేనాథుడే లేడు. యుద్ధం దెబ్బకు దుబాయ్ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ కు మద్దతుగా నిలిచినందుకు గల్ఫ్ దేశాలు మూల్యం చెల్లించుకున్నాయి. ఇరాన్ వరుస బాంబు దాడులతో ఎడారి దేశాలను హడలెత్తించింది.

పలు భవనాలను నామరూపాలు లేకుండా చేసేసింది. దీంతో మొన్నటి వరకూ దుబాయ్ లో తప్ప వేరెక్కడా పెట్టుబడులు పెట్టని వారంతా ఇప్పుడు ఆ దేశమంటేనే వణికిపోతున్నారు. యుద్ధం ప్రభావంతో గతేడాదితో పోలిస్తే 40 శాతం రియల్ అమ్మకాలు పడిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఆస్తులుఅమ్ముకునేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. .
దుబాయ్‌లో నిర్మాణంలో ఉన్న భవనాలు, విల్లాల ధరలు 10 నుంచి 15 శాతం వరకు తగ్గిపోయాయి.

ఒకప్పుడు అత్యంత వేగంగా అమ్ముడైన విలాసవంతమైన విల్లాలను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కొనుగోలుదారులు ఒప్పందం కుదుర్చుకునే ముందు మరింత లోతైన రాయితీలను రాబట్టుకుంటున్నారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పేరుకుపోయిన ఒప్పందాల కారణంగా…మార్చి నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. మార్చిలో వాస్తవ అమ్మకాలు 50 శాతం వరకు తగ్గాయి. నిజానికి గత ఏడాది వేగంతో పోల్చి చూస్తే అంతగా విస్తరించనప్పటికీ…రియల్ మార్కెట్‌ స్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Dubai
Dubai

మరోవైపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు వాయిదాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్ మేనేజర్లు సైతం భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతాయన్న టెన్షన్, ఆస్తి విలువలు కూడా పడిపోతుండటంతో కొత్తగా ఒప్పందాలు చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

తమను నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దడానికి దుబాయ్ ప్రభుత్వం 270 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. వ్యాపారాలను, కుటుంబాలను ఆదుకోవడానికి ఈ నిధులను కేటాయించనున్నారు.

Comfort Zone : మీరూ రిస్క్ తీసుకోని జీవితానికి అలవాటు పడ్డారా? .. కంఫర్ట్ జోన్ చాలా డేంజర్ అట

Related Articles

Back to top button