Just SportsLatest News

Cameron Green : రూ.25 కోట్లు దండగేనా ?…కోటి రూపాయలకు ఒక రన్

Cameron Green : ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్.. అన్నీ డబ్బులతో ముడిపడి ఉంటాయి. ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీ ఓనర్లు, స్పాన్సర్లు, మీడియా హక్కులు ఇలా ఏది చూసినా అంతా డబ్బుతోనే లింక్ ఉంటుంది.

Cameron Green

ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్.. అన్నీ డబ్బులతో ముడిపడి ఉంటాయి. ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీ ఓనర్లు, స్పాన్సర్లు, మీడియా హక్కులు ఇలా ఏది చూసినా అంతా డబ్బుతోనే లింక్ ఉంటుంది. ముఖ్యంగా వేలంలో ఆటగాళ్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినప్పుడు వారిపై అంచనాలు కూడా అలానే ఉంటాయి.

అయితే ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైనప్పుడు విమర్శలు కూడా దానికి రెట్టింపు స్థాయిలో ఎదురవుతుంటాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గత ఏడాది మినీవేలంలో గ్రీన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 10 కాదు, 20 కాదు ఏకంగా రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

అతని కోసం ఇతర ఫ్రాంచైజీలతో గట్టిగానే పోరాడి దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ కావడంతో భారీగానే ఆశలు పెట్టుకుని రికార్డు ధరకు బిడ్డింగ్ లో కొనుగోలు చేసింది. అయితే అద్భుతమైన మ్యాచ్ విన్నర్ కాకున్నా కూడా ఇన్ని కోట్లు పెట్టడం అవసరమా అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి. కానీ కేకేఆర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా గ్రీన్(Cameron Green) పై నమ్మకంతో రికార్డు ధర పెట్టేసింది. ఐపీఎల్ 19వ సీజన్ మొదలైన తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ అభిమానులు గ్రీన్ ఎలా ఆడతాడంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే గ్రీన్ మొదటి మూడు మ్యాచ్ లలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై 2 , తర్వాత ముంబై ఇండియన్స్ పై 18 పరుగులు , పంజాబ్ కింగ్స్ పై 4 పరుగులకే ఔటయ్యాడు. మూడు మ్యాచ్ లలో కలిపి కేవలం 24 పరుగులే చేశాడు. దీంతో కోటి రూపాయలకు ఒక పరుగు చేశాడంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. అసలు గ్రీన్ కు అన్ని కోట్లు పెట్టడం అవసరమా అన్న అభిప్రాయం మరోసారి చర్చకొచ్చింది.

Cameron Green
Cameron Green

గతంలో అతని నుంచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు పెద్దగా ఏమీ లేవు. అయినా కూడా కోల్ కతా ఏం ఆలోచించి అన్ని కోట్లు వెచ్చించిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే గ్రీన్ బౌలింగ్ కూడా చేయడం లేదు. ఈ విషయంపై కేకేఆర్ కెప్టెన్ రహానె కూడా అసంతృప్తిగా ఉన్నాడు. తొలి మ్యాచ్ ముగిసినన తర్వాత దీనిపై రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడు ఆసీస్ బోర్డుకే తెలియాలంటూ చెప్పాడు.

వెన్నునొప్పి సమస్యల కారణంగా గ్రీన్(Cameron Green) ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్ చేయడం లేదనీ ఆసీస్ బోర్డు తెలిపింది. మరోవైపు మాజీ ఆటగాళ్లు సైతం కామెరూన్ గ్రీన్ సత్తాపై పెదవి విరుస్తున్నారు. అతన్ని కేకేఆర్ తుది జట్టు నుండి తొలగించాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గ్రీన్ సరిపోడని విశ్లేషించాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ గా అతని కంటే జట్టులో ఇంకా చాలామంది ఉన్నారని గుర్తు చేశాడు. మొత్తం మీద రూ.25 కోట్లు దండగేనంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Rajasthan Royals : దంచికొట్టిన జైస్వాల్, వైభవ్…రాజస్థాన్ చేతిలో ముంబై ఓటమి

Related Articles

Back to top button