David Miller : సింగిల్ తీయని మిల్లర్…మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా ?
David Miller : ఐపీఎల్ జరిగినప్పుడు ప్రతీసారీ పలు వివాదాలు కామనే. ప్రస్తుత సీజన్ లో అంపైరింగ్ తప్పిదాలు చర్చనీయాంశమవుతున్నాయి.
David Miller
ఐపీఎల్ జరిగినప్పుడు ప్రతీసారీ పలు వివాదాలు కామనే. ప్రస్తుత సీజన్ లో అంపైరింగ్ తప్పిదాలు చర్చనీయాంశమవుతున్నాయి. థర్డ్ అంపైర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా ఢిల్లీ , గుజరాత్ మధ్య మ్యాచ్ లో పలు ట్విస్టులు చాలా అనుమానాలకు తావిస్తున్నాయి.
చివర్లో మిల్లర్(David Miller) లాంగ్-ఆఫ్ వైపు షాట్ కొట్టినప్పుడు సరిగ్గా బౌండరీపై పడింది. దీనిని ఫోర్ గానే ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. రీప్లే క్లియర్ గా చూపించకుండా థర్డ్ అంపైర్ దానిని ఫోర్ గా ఇచ్చాడు. అలాగే చివరి నాలుగు ఓవర్లలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
మిల్లర్ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగడం, చివర్లో మళ్లీ తిరిగి వచ్చి విధ్వంసం సృష్టించి దాదాపు గెలిపించినంత పని చేశాడు. అదే సమయంలో ఢిల్లీ ఓటమికి కారణం మిల్లరే. ఎందుకంటే 2 ఓవర్లలో 36 పరుగులు చేయాల్సి ఉండగా.. సిరాజ్ బౌలింగ్ ను ఉతికారేశాడు. మొదటి బంతిని సిరాజ్ వైడ్ వేయగా.. తర్వాత వరుసగా మూడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. ఐదో బంతికి విప్రజ్ ఫోర్ బాది, చివరి బాల్ కు సింగిల్ తీసాడు. దీంతో సమీకరణం కాస్తా 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది.
ప్రసిద్ధ కృష్ణ 20వ ఓవర్ ను వేయగా.. తొలి బంతినే బౌండరీ బాదాడు విప్రజ్. కానీ తర్వాత బంతికి అతను ఔటవడం, క్రీజులోకి వచ్చిన కుల్దీప్ సింగిల్ తీయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నాలుగో బంతికి మిల్లర్ సిక్సర్ బాదడంతో ఢిల్లీ గెలిచినట్టే అనుకున్నారు. కానీ ఐదో బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా మిల్లర్(David Miller) తీయకపోవడం ఆశ్చర్యపరిచింది. అప్పటికి ఢిల్లీ చేయాల్సింది 2 బంతుల్లో 2 పరుగులే.

మిల్లర్ సింగిల్ తీయకపోవడంతో ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి వచ్చింది. ప్రసిద్ధ కృష్ణ తెలివిగా బౌన్సర్ వేశాడు. దీంతో బంతి మిల్లర్ కు అందలేదు. సింగిల్ రాలేదు. బై కోసం కుల్దీప్ పరిగెత్తినా ఈ లోపే బట్లర్ వికెట్లను గురి చూసి కొట్టాడు. దీంతో గుజరాత్ 1 పరుగు తేడాతో గట్టెక్కింది. అయితే మిల్లర్ సింగిల్ ఎందుకు తీయలేదన్న అనుమానాలు మొదలయ్యాయి.
కుల్దీప్ మీద నమ్మకం లేక సింగిల్ తీయలేదా.. లేక ఉద్దేశపూర్వకంగా రన్ తీయలేదా అన్న డౌట్స్ వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. ఒకవేళ మిల్లర్ సింగిల్ తీసి ఉండుంటే కనీసం టైగా ముగిసేది., సూపర్ ఓవర్ ఆడే అవకాశం ఉండేది.
Gujarat Titans : గట్టెక్కిన గుజరాత్…ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి





