Just LifestyleLatest News

Legs Crossed : కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా? సైన్స్ ఏం చెబుతుంది? సైకాలజీ ఏం చెబుతుంది?

Legs Crossed : మనం కాలు మీద కాలు వేసినప్పుడు, మోకాలి వెనుక ఉండే రక్తనాళాలు నొక్కుకుపోతాయి.

Legs Crossed

నలుగురిలో కూర్చున్నపుడు చాలా స్టైలిష్‌గా, హుందాగా కనిపించాలని కొంతమంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. అది చూడ్డానికి  చాలా రిలాక్స్‌డ్‌గా, చాలా కాన్ఫిడెన్స్‌తో కూడిన భంగిమలా అనిపించొచ్చు. కానీ, ఈ ఒక్క చిన్న అలవాటు నిశ్శబ్దంగా వారి బాడీ లోపల ఎన్నో మార్పులకు కారణమవుతుందని చాలా మందికి తెలియదు.

మనం కూర్చునే తీరు కేవలం వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదని, నరాల పనితీరును, రక్త ప్రసరణను కూడా శాసిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కాళ్లు క్రాస్(Legs Crossed) చేసి కూర్చున్నప్పుడు మన బాడీలోని అతిపెద్ద నరాలలో ఒకటి ఒత్తిడికి గురవుతుంది. సాధారణంగా మన హృదయం రక్తాన్ని శరీరానికి అంతటా పంపిస్తుంది.

కానీ కాళ్ల నుంచి రక్తం తిరిగి గుండెకు చేరాలంటే మాత్రం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణించాలి. మనం కాలు మీద కాలు వేసినప్పుడు(Legs Crossed), మోకాలి వెనుక ఉండే రక్తనాళాలు నొక్కుకుపోతాయి. దీనివల్ల రక్తం తిరిగి గుండెకు వెళ్లడం కష్టమై, తాత్కాలికంగా రక్తపోటు (Blood Pressure) పెరుగుతుంది. ఈ అలవాటే కనుక గంటల తరబడి కొనసాగితే, రక్తనాళాలు బలహీనపడి వెరికోస్ వీన్స్ అనే సమస్యకు దారితీస్తుంది, అంటే కాళ్లలోని నరాలు ఉబ్బిపోయి నీలం రంగులోకి మారిపోతాయి.

కేవలం నరాలే కాదు, మన వెన్నెముక కూడా ఈ భంగిమ వల్ల ఇబ్బంది పడుతుంది. కాలు మీద కాలు వేయడం వల్ల నడుము ఎముకలు (Pelvis) అసమానంగా వంగిపోతాయట. ఇది వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడిని పెంచేసి, దీర్ఘకాలిక నడుము నొప్పికి , డిస్క్ సమస్యలకు కారణం అవుతుంది. దీనివల్ల చాలామందికి పాదాలు మొద్దుబారిపోవడం, చీమలు పాకినట్లు అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం మోకాలి వెనుక ఉండే పెరోనియల్ నెర్వ్ అనే కీలకమైన నరం ఒత్తిడికి గురికావడమేనని డాక్టర్లు చెబుతున్నారు.

ఇక మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం మనం కూర్చునే విధానం మన అంతరంగాన్ని ప్రతిబింబించే ఒక అద్దం వంటిదని అంటారు. బాడీ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ .. కాలు మీద కాలు వేసుకోవడాన్ని రక్షణాత్మక ధోరణికి (Defensive attitude) సింబల్‌గా భావిస్తారు. అంటే, ఒక వ్యక్తి కొత్త వ్యక్తులతో లేదా అపరిచిత వాతావరణంలో ఉన్నప్పుడు తనను తాను సేఫ్‌గా ఉంచుకోవడానికి బాడీని క్లోజ్ చేసుకున్నట్లుగా ఇలా కూర్చుంటారట. ఇది ఎదుటివారికి నేను మీ మాటలను పూర్తిగా స్వీకరించడం లేదని, నేను కొంత రిజర్వ్‌డ్‌గా ఉన్నాననే సంకేతాన్ని ఇస్తుందట.

Legs Crossed
Legs Crossed

అయితే, కొన్ని సంస్కృతులలో ఇది ఆధిపత్యానికి, అధికారాన్ని ప్రదర్శించడానికి కూడా వాడతారని సైకాలజీ చెబుతుంది. ఉదాహరణకు, మోకాలిపై పాదాన్ని ఉంచి అంటే ఫోర్ ఫొజిషన్ (Figure-four position)లో కూర్చోవడం అనేది అత్యంత కాన్ఫిడెన్స్‌ను, ఒక రకమైన పోటీతత్వాన్ని సూచిస్తుందట. అయితే ఒకవేళ ఎవరైనా చర్చ మధ్యలో హఠాత్తుగా కాళ్లు క్రాస్ చేశారంటే,  ఆ సంభాషణ పట్ల వారు విసుగు చెందినట్లు కానీ మానసికంగా ఆ చర్చ నుంచి తప్పుకున్నట్లు కానీ అర్థం చేసుకోవాలట.

మొత్తంగా ఆరోగ్యం దృష్ట్యా చూస్తే రెండు పాదాలను నేల మీద సమాంతరంగా ఆనించి కూర్చోవడమే మంచిది. ఒకవేళ మీకు కాళ్లు క్రాస్ చేసుకునే అలవాటు ఉంటే మాత్రం, కనీసం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అయినా కాళ్లను మారుస్తూ ఉండాలి. శరీరానికి అవసరమైన బ్రేక్ ఇస్తూ, సరిగ్గా కూర్చోవడం అలవాటు చేసుకుంటే మాత్రం చాలా అనారోగ్య సమస్యలను మొదటిలోనే అడ్డుకోవచ్చు.

SRH vs PBKS : సన్ రైజర్స్ పుంజుకుంటుందా ?…పంజాబ్ కింగ్స్ తో కీ ఫైట్

Related Articles

Back to top button