Mango: మీరు మామిడి పండ్ల ప్రియులా? అయితే మ్యాంగోను తినడానికి కూడా ఓ లెక్క ఉందని తెలుసుకోండి..
Mango: రోజుకు ఒక మామిడి పండు కంటే ఎక్కువగా తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Mango
పండ్లలో రాజు అయిన మామిడి పండు రుచిలో అద్భుతం అని మ్యాంగో లవర్స్ మాత్రమే కాదు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే, రుచిగా ఉన్నాయి కదా అని మోతాదుకు మించి తినేసారో ఇక అంతే సంగతులు. ఎందుకంటే మ్యాంగోలు ఎక్కువ తినడం వల్ల కోరి ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
అలాగే మామిడిపండ్లను ఎప్పుడు తినాలని అనుకున్నా కూడా మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కాకుండా..వాటిని బకెట్ నీటిలో ఒక అరగంట పాటు అయినా నాననిచ్చి ఆ తర్వాత తినాలి. ఎందుకంటే ఇలా చేస్తే వాటికి పురుగు మందులు వంటివి కొడితే వాటి ప్రభావం నుంచి కాస్త తప్పించుకున్నట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి మామిడి పండులో చక్కెర స్థాయిలు (Sugar Levels), కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి బరువు పెరగడంతో పాటు ఒక్కోసారి విరేచనాలు వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే రోజుకు ఒక మామిడి పండు కంటే ఎక్కువగా తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే మనలో చాలామంది చేసే మరో పెద్ద పొరపాటు ఏంటంటే, భోజనం చేసిన వెంటనే మామిడి పండును డెజర్ట్‌లా తీసుకుంటారు. ముఖ్యంగా బిర్యానీ వంటి భారీ భోజనం తర్వాత మామిడి పండును తింటారు. ఇలా చేస్తే జీర్ణక్రియపై విపరీతమైన భారం పడి అజీర్తి, గ్యాస్ సమస్యలు వంటివి తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే భోజనానికి , పండు తినడానికి మధ్య కనీసం రెండు గంటల సమయం అయినా ఉండేలా చూసుకోవాలి. అలాగే మామిడిని జ్యూస్ రూపంలో కాకుండా పండులాగే తింటేనే ఎక్కువ ఉపయోగాలుంటాయి. మ్యాంగోని జ్యూస్‌గా చేయడం వల్ల అందులోని కీలకమైన ఫైబర్ (పీచు పదార్థం) కోల్పోతాము. పీచు పదార్థం లేకపోతే బాడీలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి.
మామిడి పండును కేవలం ఒకదానినే కాకుండా మ్యాంగోతో పాటు బాదం పప్పులు , పెరుగు వంటి ప్రోటీన్ కలిగిన ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్‌లో ఉంటాయి. అంతేకాదు రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లు తినడం కూడా అంత మంచిది కాదు. పండును ఎప్పుడూ కూడా నిదానంగా, నమిలి తింటేనే బాడీకి కావాల్సిన పూర్తి పోషకాలు లభిస్తాయి. మొత్తంగా ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తూ.. పండ్ల రాజును ఆరోగ్యంగా ఆస్వాదించండి.
Galaxy S25:శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఫ్యాన్స్‌కు పండుగే.. గెలాక్సీ S25 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్





