Galaxy S25:శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఫ్యాన్స్‌కు పండుగే.. గెలాక్సీ S25 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Galaxy S25: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లోని రెండు పవర్ఫుల్ మోడల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను అనౌన్స్ చేసింది.
Galaxy S25
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే వార్త వచ్చింది. ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే కెమెరా క్వాలిటీతో లభించే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లోని రెండు పవర్ఫుల్ మోడల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను అనౌన్స్ చేసింది. కేవలం ప్రైస్ తగ్గింపు మాత్రమే కాకుండా, బ్యాంక్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్లను సగం ధరకే దక్కించుకునే ఛాన్స్ ఉంది.
ముందుగా శాంసంగ్ గెలాక్సీ S25 (Galaxy S25) ఫ్యాన్ ఎడిషన్ (Fan Edition) గురించి చెప్పుకోవాలి. ఫ్లాగ్షిప్ ఫీచర్లను తక్కువ ధరకే అందించే ఈ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువగా లభిస్తోంది. దీని అసలు ధర దాదాపు 59,999 రూపాయలు ఉండగా, అమెజాన్ ప్రత్యేక సేల్‌లో దీనిని కేవలం 50,580 రూపాయలకే లిస్ట్ చేశారు. అంటే నేరుగానే భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
అంతేకాదు దీనికి ఎక్స్ట్రాగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఉన్నవాళ్లు మరో 1,500 రూపాయల వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ ఫోన్ ధర 50 వేల రూపాయల కంటే తక్కువకే చేరుకుంటుంది. మీ దగ్గర ఓల్డ్ ఫోన్ ఉంటే, దానిని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా 40,990 రూపాయల వరకు వాల్యూ పొందే ఛాన్స్ ఉంది. దీనివల్ల బడ్జెట్ ధరలోనే ఒక అద్భుతమైన ఫ్లాగ్షిప్ ఫోన్ మీ చేతికి వస్తుంది.
ఇక మరింత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం అయితే శాంసంగ్ గెలాక్సీ S25 (Galaxy S25)ప్లస్ మోడల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర 71,499 రూపాయల వద్ద ఉండగా, వివిధ బ్యాంక్ ఆఫర్ల ద్వారా దీనిని దాదాపు 69,000 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

దీనిపై కూడా భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. పాత ఫోన్ కండిషన్ బాగుంటే దాదాపు 40 వేల రూపాయల వరకు తగ్గింపు లభించే ఛాన్స్ ఉంది. ఒకేసారి అంత మనీ చెల్లించలేని వారి కోసం నెలకు కేవలం 2,510 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఈజీ ఈఎంఐ (EMI) ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ ఓల్డ్ ఫోన్ యొక్క బ్రాండ్ , అది పనిచేసే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఫోన్ కొనేటప్పుడే అదనంగా కొంచెం మొత్తం చెల్లించి స్క్రీన్ ప్రొటెక్షన్, మొబైల్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను కూడా పొందొచ్చు.
తక్కువ ధరలో మంచి బ్రాండ్ ఇమేజ్, అదిరిపోయే డిస్ప్లే ,కెమెరా ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి ఈ డీల్స్ నిజంగానే ఒక పండుగేనని చెప్పొచ్చు. స్టాక్ ముగిసేలోపే ఈ ఛాన్స్‌ను వినియోగించుకోవడమే మంచిది.
New CEO: ఏఐ సవాళ్ల మధ్య యాపిల్ కొత్త సీఈఓ ఎంట్రీ.. టెక్ దిగ్గజం పయనం ఎలా ఉండబోతోంది?





