Just SportsLatest News

RCB vs DC : ఆర్సీబీకి ఎదురుందా ?..ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్

RCB vs DC : ఐపీఎల్ 2026 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది

RCB vs DC

ఐపీఎల్ 2026 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వరుస విజయాలతో తన హోదాకు తగ్గట్టే ఆడుతున్న ఆర్సీబీ సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్(RCB vs DC) తో తలపడబోతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లలో ఐదు విజయాలు సాధించి రెండింటిలో ఓడిపోయింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్ లో గుజరాత్ పై 206 పరుగుల టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ దూరమైనా సరే విరాట్ కోహ్లీ, పడిక్కల్ తో పాటు పటిదార్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. చివర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా సైతం చెలరేగుతున్నారు. దీంతో మొదట బ్యాటింగ్ అయినా , ఛేజింగ్ అయినా ఆర్సీబీకి ఎదురేలేకుండా పోతోంది.

అయితే ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమికి వారి సొంతగడ్డపైనే ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ , హ్యాజిల్ వుడ్ కీలకం కానున్నారు. రసిక్ సలామ్ దార్ గాయపడడంతో మంగేశ్ యాదవ్ కు చోటు దక్కనుంది. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ ఆర్సీబీకి ప్రధాన బలం. ముఖ్యంగా కృనాల్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ బెంగళూరు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు ఓటములతో కాస్త డీలా పడింది. గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోరు సాధించినా పరాజయం తప్పలేదు. బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్, నితీశ్ రాణా ఫామ్ లో ఉండగా.. నిస్సాంక నిరాశ పరుస్తున్నాడు.సమీర్ రిజ్వీ, డేవిడ్ మిల్లర్ కూడా చెలరేగితే తప్ప ఢిల్లీ ఓటముల బాట వీడేటట్టు కనిపించడం లేదు.

RCB vs DC
RCB vs DC

బౌలింగ్ లో మాత్రం ఢిల్లీ మరింత మెరుగవ్వాల్సిందే. పంజాబ్ కింగ్స్ పై గాయపడిన ఎంగిడి కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో చమీరాకు అవకాశం దక్కనుంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 7 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించిన ఢిల్లీ నాలుగింటిలో ఓడిపోయింది.

స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అనుకున్న స్థాయిలో రాణించకపోవడం కూడా వారి ఓటములకు కారణమవుతోంది. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 34 మ్యాచ్ లలో తలపడితే 20 సార్లు ఆర్సీబీ, 13 సార్లు ఢిల్లీ గెలిచాయి. ఇక ఢిల్లీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.

Gujarat Titans : చెపాక్ లో చెన్నైకి బిగ్ షాక్..గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ

Related Articles

Back to top button