Working hours: రోజుకు 8 గంటలు కాదా..వారానికి 80 గంటలు పనిచేయాలా?
Working hours: కల సాకారం కోసం 14 గంటల కష్టపడాలా? అలా చేస్తే మానసిక ఆరోగ్యానికి ముప్పవుతుందా?

Working hours
రాత్రిళ్లు నిద్ర మర్చిపోతేనే కలలు నెరవేరుతాయా?”..రోజుకు 14 గంటలు (Working hours) పనిచేయమన్న భారత యువ వ్యాపారవేత్త మాటలు పెద్ద కల్లోలమే రేపుతున్నాయి.
సిలికాన్ వ్యాలీ పొడవైన వీధుల్లో ఒక చిన్న టేబుల్ దగ్గర ఇద్దరు భారతీయులు పనిచేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. నేహా సురేశ్(Neha Suresh), ఆకాశ్ ఇద్దరూ ఒకే రూమ్‌లో వేర్వేరు డెస్కులపై కంప్యూటర్ల ముందు కూర్చుని నిరంతరంగా పని చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో తిరుగుతున్నాయి. అయితే వారిద్దరూ అలా కూర్చుని పనిచేయడం గురించి కాదు .. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఈ వీడియో చర్చల్లో నిలిచింది.
నేహా మాట్లాడుతూ .. ఈ ప్రపంచాన్ని మార్చేంత గొప్ప ఆవిష్కరణ చేసుకోవాలంటే రోజుకు 14 గంటలు పని చేయాల్సిందే. ఒక వారం మొత్తానికి 80 గంటలు(80 hour work week) కూడా తక్కువే. 8 గంటల పని చేస్తూ(Working hours)… గ్రేట్ ప్రోడక్ట్స్ వస్తాయనుకోవడం భ్రమ అని చెప్పుకొచ్చింది. ఈ మాటలే ఇప్పుడు హీటు పుట్టించి పెద్ద చర్చకు తెరలేపాయి.

సోషల్ మీడియాలో కొంతమంది ఆమె డెడికేషన్‌ను ప్రశంసించగా..మరికొందరు ఆ విధానాన్ని తీవ్రమైన పని మోజుగా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇది మామూలు డిబేట్ కాదు. ఇది “హార్డ్ వర్క్ vs స్మార్ట్ వర్క్”, “బర్నౌట్ vs గ్రోత్” మధ్య పాత తగాదాకు ఓ కొత్త రూపం అంటున్నారు మరికొంతమంది.
గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి(Narayana Murthy) కూడా ఇదే తరహాలో స్పందించారు. దేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ దేశాలు ఎలా తిరిగి ఎదిగాయో మన దేశం కూడా కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
If you're not spending 14+ hours a day working on your dream you're ngmi.
You can’t build a world-changing product on 9–5 energy.
80-hour weeks aren’t extreme. It's baseline. pic.twitter.com/6lTxrqUxJZ
— Neha (@Neha_Suresh_M) July 31, 2025
అదే విధంగా L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం అయితే, ఆదివారం కూడా సెలవు వద్దని, వారానికి 90 గంటల పని అవసరమని వ్యాఖ్యానించారు. ఇవన్నీ కలిపి చూస్తే, ఇది ఏకంగా భారత వర్క్ కల్చర్ మీదే కొత్త వాదనకు నాంది అవుతోంది.
కానీ… పనిగంటలు పెరిగితే, నిజంగా ప్రొడక్టివిటీ పెరగుతుందా? లేక మానసిక ఒత్తిడితో మెదడు చైతన్యం తగ్గిపోతుందా? దీనిపై మానసిక నిపుణులు చెప్పే మాటలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..మన మెదడుకు ఓ ప్రాసెసింగ్ శక్తి ఉంటుంది, అది ఒక స్థాయికి మించి వాడితే, స్థిమితం కోల్పోతుంది. రోజుకు 10-12 గంటల కంటే ఎక్కువ పని చేస్తే, మెదడుకు విశ్రాంతి లేకపోవడం వల్ల డిప్రెషన్, బర్నౌట్, డెసిషన్ ఫాటిగ్ వంటి సమస్యలు రావొచ్చని చెబుతున్నారు.
పని పట్ల కమిట్మెంట్ ఉండటం తప్పు కాదు. కానీ పనే జీవితం మొత్తాన్ని మింగేస్తే, ఆ జీవితం విలువే లేకుండా పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత – తమ కలల కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నా, అది లాంగ్ టర్మ్ లో హెల్త్, రిలేషన్షిప్స్, క్రియేటివిటీ మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంటున్నారు.
అదే సమయంలో, కొన్ని దశల్లో ఎక్కువ పనిచేయాల్సి రావడం తప్పదని నిపుణులు అంగీకరిస్తున్నారు. కొత్తగా స్టార్టప్ మొదలుపెట్టిన వారు, విజన్‌ను రియలిటీగా మార్చాలంటే, కొంతకాలం ఎక్కువ పని చేయాల్సిన అవసరం పడుతుందని చెబుతున్నారు. కానీ ఆ శ్రమ స్మార్ట్ ప్లానింగ్‌తో, సమయం సమర్థవంతంగా వినియోగించుకునేలా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: Apricots : డ్రై ఆప్రికాట్లు 2 తింటే చాలట.. కావాల్సినన్ని లాభాలు