Just TelanganaJust SportsLatest News

HCA T20 League : హెచ్ సీ ఎ టీజీ20 లీగ్ ఆవిష్కరణ..అత్యుత్తమ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారన్న రాయుడు

HCA T20 League : తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఒక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీజీ20 లీగ్ ప్రారంభించింది.

HCA T20 League

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఒక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీజీ20 లీగ్ ప్రారంభించింది(HCA T20 League ). ఈ లీగ్ కు సంబంధించిన లోగోను అంబటి రాయుడు, హీరో వెంకటేష్ దగ్గుబాటి, మరియు సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఆవిష్కరించారు.  

ఈ కార్యక్రమానికి హెచ్.సి.ఏ. సింగిల్ మెంబర్ సూపర్వైజరీ కమిటీ చైర్మన్  న్యాయమూర్తి పి. నవీన్ రావు,  తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- క్రీడలు, యువజన, ఐటీఈ & సీ జయేష్ రంజన్ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు వి. చాముండేశ్వర నాథ్, హెచ్.సి.ఏ. సభ్యులు, ఫ్రాంచైజీ యజమానులు మరియు ప్రముఖ కార్పొరేట్ ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ లీగ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 160 మంది ఆటగాళ్లతో కూడిన 8 ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటాయి. మొత్తం 20 రోజుల వ్యవధిలో 32 ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు నిర్వహించబడతాయి. అన్ని మ్యాచ్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్ జూన్, జూలై నెలల్లో జరగనుంది.

ఈ లీగ్ గ్రామీణ స్థాయి క్రికెట్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఎలైట్ పోటీల మధ్య ఒక కీలక వంతెనగా రూపకల్పన చేశారు. ఆటగాళ్లకు అధిక ఒత్తిడిలో మ్యాచ్ అనుభవం, ప్రొఫెషనల్ మౌలిక వసతులు మరియు అత్యున్నత స్థాయిలో రాణించడానికి అవసరమైన పోటీ వేదికను అందించడం దీని లక్ష్యం.

HCA T20 League
HCA T20 League

ఈ లీగ్ ద్వారా తెలంగాణ నుంచి మరింతమంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి రావాలని, గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, హీరో వెంకటేష్ అభిప్రాయ పడ్డారు.జిల్లా స్థాయి ఆటగాళ్లకు ఐపీఎల్ వంటి ఉన్నత స్థాయి వేదికల వరకు చేరుకునేలా ఈ లీగ్ రూపొందించినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ రెడ్డి చెప్పారు. ఇటీవలఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ప్రక్రియకు కార్పొరేట్ వర్గాల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు.

Hair : జుట్టుపై సమ్మర్ ఎఫెక్ట్ ఉంటుందా? జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా?

Related Articles

Back to top button