Just SpiritualLatest News

Puja Room : వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఎక్కడ ఉండాలో తెలుసా?

Puja Room : పూజా స్థలం ఎప్పుడూ పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం వల్ల ఇంట్లో ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

Puja Room

ఇంట్లో పూజ గది కేవలం దేవుడి పూజలకే కాకుండా సానుకూల శక్తిని.. ప్రసరింపజేసే కేంద్రంగా కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజ గదిని సరైన దిశలో ఏర్పాటు చేయకపోతే మాత్రం అది కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

వాస్తు ప్రకారం పూజ గదికి ఈశాన్యం, ఉత్తర తూర్పు మూల అత్యంత శుభప్రదమైన దిశగా వాస్తు శాస్త్రంలో పరిగణించబడుతుంది. ఈ దిశలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది స్థలం తక్కువగా ఉందని వంటగదిలో పూజ గది(Puja Room )ని ఏర్పాటు చేస్తారు. కానీ వంటగది అగ్ని తత్వానికి చిహ్నంగా అలాగే పూజ గది శాంతికి చిహ్నంగా భావిస్తారు.

ఈ రెండు విరుద్ధ శక్తులు కలిసి ఉండటం వల్ల ..ఇంట్లో ఉద్రిక్తతలు పెరుగుతాయి. అంతేకాదు బెడ్ రూమ్‌లో పూజా మందిరాన్ని ఉంచడం దేవతల పట్ల అగౌరవంగా భావించబడుతుంది. ఇది మానసిక అస్థిరతకు దారి తీస్తుంది. మెట్ల కింద ఉండే ప్రదేశం ఒత్తిడికి సంకేతం కాబట్టి అక్కడ దేవుడి గదిని నిర్మించకూడదట.

Puja Room
Puja Room

అలాగే బాత్‌రూమ్ దగ్గరలో పూజ గది ( Puja Room ) ని ఉంచడం అత్యంత అశుభకరం అని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇవి అపవిత్ర ప్రదేశాలుగా భావించబడటంతో పూజ ఫలితాలు తగ్గి నెగిటివిటీ పెరుగుతుందని నమ్మకం. దక్షిణ దిశను యముని , పితృదేవతల దిశగా భావిస్తారు. కాబట్టి ఆ వైపున దేవుడి మందిరం ఉండకూడదు. పూజా మందిరాన్ని డైరెక్టుగా నేలపై పెట్టకుండా శుభ్రమైన చెక్క పీఠంపై లేదా కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి.

పూజా స్థలం ఎప్పుడూ పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం వల్ల ఇంట్లో ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఎప్పుడూ కూడా సరైన వాస్తు నియమాలు పాటించడం వల్ల.. మానసిక అశాంతి తొలిగిపోయి.. కుటుంబ పురోగతికి బాటలు పడతాయి. హిందూ సంప్రదాయంలో గృహంలో ఉండే ఆలయాన్ని పాజిటివ్ పవర్‌కి కేంద్రంగా భావిస్తారు. కాబట్టి పూజా గది ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Digital Waste : మీ ఫోన్ నిండా అనవసరమైన ఫోటోలు దాస్తున్నారా? డిజిటల్ చెత్తతో జాగ్రత్త..

Related Articles

Back to top button