Just BusinessLatest News

Gold :గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ ..పెరిగిన బంగారం ధరలు

Gold : గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇవాళ బ్యాడ్ న్యూస్ వినిపించింది. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నిన్నటి నుంచి ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశాయి

Gold

గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇవాళ బ్యాడ్ న్యూస్ వినిపించింది. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నిన్నటి నుంచి ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశాయి. అటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం రేట్లు పెరగడంతో, మన దేశీయ మార్కెట్‌లో కూడా పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. అయితే, సిల్వర్ మాత్రం నిన్నటి భారీ పెరుగుదల తర్వాత ఈరోజు పెరగకుండా అదే ధరతో కొనసాగుతుండటం కొంచెం ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు.

గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం చూస్తే.. దేశంలో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) బంగారంపై రూ. 330 పెరగగా, జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం(Gold )పై రూ. 300 పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు గోల్డ్ ధర 8 డాలర్లు పెరిగి 4,699 డాలర్లకు చేరుకోవడమే ఈ రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణం.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1లక్ష52వేల390 వద్ద ఉంటే, 22 క్యారెట్ల బంగారం (Gold ) ధర రూ. 1లక్ష39వేల900 గా ఉంది. ఇక ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ. 1లక్ష52వేల460 కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష39వేల750 వద్ద కొనసాగుతోంది.

Gold
Gold

మే 6 బుధవారం కేజీ సిల్వర్‌పై ఏకంగా రూ. 10,000 పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 2లక్షల75వేల వద్ద ఉండగా, ఢిల్లీ , ముంబైలో రూ. 2 లక్షల70వేల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కూడా కిలో వెండి రూ. 2లక్షల75వేలు గా నమోదైంది.

అయితే ఇక్కడ పేర్కొన్న ధరలు కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని కొనుగోలుదారులు గమనించాలి. జీఎస్‌టీ (GST), మేకింగ్ ఛార్జ్ (Making Charges) వంటి ఇతర పన్నుల వల్ల వివిధ జ్యెవెలరీ షాపుల ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. కాబట్టి కొనే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవడం మంచిది.

Betel Leaf: ఇంట్లో తమలపాకు తీగ ఉంటే శని దోషం ఉండదా? ఏ దిశలో పెంచాలో తెలుసా?

Related Articles

Back to top button