HealthLatest News

Vitamin B12 : విటమిన్ బి12 లోపం..సైలెంట్ కిల్లర్ అని తెలుసుకోండి..

Vitamin B12: మన మెదడు చురుకుదనం, నరాల వ్యవస్థ రక్షణ, రక్త కణాల ఉత్పత్తి ఈ ఒక్క విటమిన్‌పైనే ఆధారపడి ఉంటాయి.

Vitamin B12

మనిషి శరీరం ఒక అద్భుతమైన యంత్రం వంటిదన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోని ప్రతి అవయవమూ సక్రమంగా పని చేయడానికి ఎన్నో పోషకాలు, ఖనిజాలు అవసరం అవుతాయి. కానీ, చాలామంది తీవ్రమైన నీరసం, నరాల బలహీనతతో బాధపడుతున్నప్పుడు వాటిని కేవలం పని ఒత్తిడి అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు.

నిజానికి శరీరంలో ప్రాణాధారమైన బి12 విటమిన్ (Vitamin B12) లోపించడం వల్లే ఈ పరిస్థితి వస్తుంది. విటమిన్ బి12ను శాస్త్రీయంగా కోబాలమిన్ అని పిలుస్తారు. మన మెదడు చురుకుదనం, నరాల వ్యవస్థ రక్షణ, రక్త కణాల ఉత్పత్తి ఈ ఒక్క విటమిన్‌పైనే ఆధారపడి ఉంటాయి. దీని లోపం ఏర్పడినప్పుడు బాడీ తీవ్రమైన హెచ్చరికలను జారీ చేస్తుంది. వాటిని వెంటనే గుర్తించకపోతే అది కోలుకోలేని శారీరక, మానసిక నష్టానికి దారితీస్తుంది.

శరీరంలో విటమిన్ బి12 (Vitamin B12) లెవెల్స్ పడిపోయినప్పుడు మొదటగా రక్తహీనత లేదా మెగాలోబ్లాస్టిక్ అనీమియా బారిన పడతారు. రక్త కణాల సైజ్ అసాధారణంగా పెరిగిపోవడం వల్ల అవి శరీర భాగాలకు ఆక్సిజన్‌ను సరిగ్గా చేరవేయలేవు. దీని వల్ల ఎంత విశ్రాంతి తీసుకున్నా వదలని క్రానిక్ ఫెటీగ్ అంటే విపరీతమైన అలసట మనల్ని పీడిస్తుంది.

అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే, నరాల చుట్టూ రక్షణ కవచంలా ఉండే మైలిన్ షీత్ దెబ్బతింటుంది. దీనివల్ల కాళ్లు, చేతుల్లో విపరీతమైన నొప్పి, సూదులతో పొడిచినట్లు ఉండటం, తరచూ తిమ్మిర్లు రావడంతో పాటు, మంటలు పుట్టడం వంటి నరాల బలహీనత లక్షణాలు కనిపిస్తాయి. ఇది ముదిరితే నడకలో స్థిరత్వం కోల్పోవడమే కాదు, పక్షవాతం వంటి తీవ్రమైన న్యూరోలాజికల్ డిజార్డర్స్‌కు దారి తీస్తుంది

బి12 లోపం వల్ల కేవలం శారీరక సమస్యలే కాదు, మెదడు పనితీరు మందగించడం, బ్రెయిన్ ఫాగ్, తీవ్రమైన కన్ఫ్యూజన్, మెమరీపవర్ మెల్లగా క్షీణించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది దీనిని వయసుతో వచ్చే మార్పు అనే అనుకుంటారు. కానీ ఇది తీవ్రమైన బి12 లోపం వల్ల జరిగే బ్రెయిన్ సెల్స్ డామేజ్ అని తెలుసుకోలేకపోతారు.

కొందరిలో ఇది తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జైటీ, పారనాయిడ్ ఆలోచనలకు కూడా దారితీస్తుంది. నోటిలో తరచూ అల్సర్స్ రావడం, నాలుక ఎర్రగా వాచిపోవడం కూడా ఈ డెఫిషియెన్సీకి స్పష్టమైన సంకేతాలు. అత్యంత అరుదైన కేసుల్లో కంటి నరం దెబ్బతిని చూపు పూర్తిగా మందగించే ప్రమాదం కూడా పొంచి ఉంది.

ఈ పరిస్థితి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి డైలీ లైఫ్‌లో కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. ఎందుకంటే, మన బాడీ బి12 విటమిన్‌ను సొంతంగా తయారు చేయలేదు. కేవలం మనం తీసుకునే ఆహారం ద్వారానే ఇది లభిస్తుంది. నాన్-వెజ్ తినే వారికి చికెన్, మటన్, లివర్, చేపలు , గుడ్ల ద్వారా ఇది పుష్కలంగా అందుతుంది.

అయితే, ప్యూర్ వెజిటేరియన్లు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే మొక్కల ద్వారా వచ్చే ఆహారంలో బి12 ఏ మాత్రం ఉండదు. అందుకే శాకాహారులు తమ డైట్‌లో పాలు, పెరుగు, పనీర్, చీజ్ వంటి డైరీ ప్రొడక్ట్స్‌ను తప్పనిసరిగా తినాలి. ఆర్టిఫిషియల్‌గా బి12 కలిపిన ఫోర్టిఫైడ్ సెరీల్స్, సోయా పాలు వంటివి కూడా ఆల్టర్‌నేట్‌గా వాడుకోవచ్చు.

Vitamin B12
Vitamin B12

ఒకవేళ బ్లడ్ టెస్టులో బి12 లెవెల్స్ ప్రమాదకరమైన స్థాయికి పడిపోయినట్లు తేలితే మాత్రం, కేవలం ఫుడ్ ద్వారా దానిని రికవరీ చేయడం అసాధ్యం. అప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వైద్యుల సలహాతో హై-డోస్ విటమిన్ బి12 సప్లిమెంట్ టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ల ద్వారా కానీ బాడీని రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సర్జరీలు అయిన వారు, 50 ఏళ్లు పైబడిన వారు , జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారిలో ఈ విటమిన్ అబ్సార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, బాడీలో వచ్చే చిన్నపాటి తిమ్మిర్లు లేదా నీరసాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అలర్ట్ అవ్వాలి.

Kolkata Knight Riders: ప్లే ఆఫ్ బెర్తుపై గుజరాత్ కన్ను..కోల్ కతాకు డూ ఆర్ డై

Related Articles

Back to top button