Just SportsLatest News

Kolkata Knight Riders: ప్లే ఆఫ్ బెర్తుపై గుజరాత్ కన్ను..కోల్ కతాకు డూ ఆర్ డై

Kolkata Knight Riders : గుజరాత్ టైటాన్స్ శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది

Kolkata Knight Riders

ఐపీఎల్ 19వ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ ఎప్పటిలానే రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ అధికారికంగా ఏ జట్టూ కూడా ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు. అయితే టాప్-2లో ఉన్న జట్లు మాత్రం దాదాపుగా ప్లే ఆఫ్ చేరినట్టే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ శనివారం కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తో తలపడబోతోంది.

ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచిన గుజరాత్ మంచి ఫామ్ లో ఉంది. నిజానికి సీజన్ ఆరంభంలో తడబడుతూ సాగిన గుజరాత్ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లలో సమిష్టిగా రాణిస్తూ టాప్-2లోకి దూసుకొచ్చింది.

గుజరాత్ కు బ్యాటింగ్ లో గిల్ , సాయి సుదర్శన్, బట్లర్ అతిపెద్ద బలం. ఈ ముగ్గురిలో ప్రతీసారీ ఇద్దరు రాణిస్తున్నారు. గిల్, సాయి అదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నారు. సాయి సుదర్శన్ 501 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉండగా.. గిల్ ఆరో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా కీలక ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుంటున్నాడు. చివర్లో జాసన్ హోల్డర్ మెరుపులు మెరిపిస్తుండగా… తెవాటియా ఇప్పటి వరకూ పెద్దగా ఆడింది లేదు.

అటు బౌలింగ్ లో రబాడ, మహ్మద్ సిరాజ్ అదరగొడుతున్నారు. వీరిద్దరితో పాటు హోల్డర్ కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు. హోల్డర్ 6 మ్యాచ్ లలో 13 వికెట్లు తీసాడు. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ కూడా ఫామ్ లోకి రావడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గుజరాత్ పై గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఈ సీజన్ లో అధికారికంగా కేకేఆర్ కథ ముగుస్తుంది. ఇప్పటి వరకూ 4 విజయాలు సాధించిన కోల్ కతా పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

Kolkata Knight Riders
Kolkata Knight Riders
Kolkata
Kolkata

వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచిన తర్వాత ఆర్సీబీ చేతిలో ఓటమి కేకేఆర్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. గత మ్యాచ్ లో కోల్ కతా భారీస్కోరే చేసినా బౌలర్లు చివర్లో ఒత్తిడికి లోనై కొంపముంచారు. బ్యాటింగ్ లో రహానే , ఫిన్ అలెన్ మంచి ఆరంభాలనే ఇస్తుండగా.. రఘువంశీ, గ్రీన్ రాణిస్తున్నారు.

చివర్లో రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ లు ఆడుతుండడం కోల్ కతాకు(Kolkata Knight Riders) ప్లస్ పాయింట్. బౌలింగ్ లో పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా మరింత రాణించాల్సిన అవసరం ఉంది. పిచ్ విషయానికొస్తే ఈడెన్ గార్డెన్స్ లో మరోసారి ఛేజింగ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Rupee:డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. చరిత్రలో తొలిసారిగా 96 మార్కును దాటిన మారకపు విలువ

Related Articles

Back to top button