Just InternationalJust BusinessLatest News

Gold: కుప్పకూలిన బంగారం ధరలు.. రెండు రోజుల్లోనే భారీ డ్రాప్!

Gold : గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ భయపెట్టిన పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలాయి.

Gold

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం అలాగే దేశీయంగా మారిన పరిస్థితులు బంగారం, వెండి మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేస్తున్నట్లు అయింది. ఏడాది పాటు గోల్డ్ కొనుగోళ్లు ఆపేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మార్కెట్‌పై గట్టి ఇంపాక్ట్ చూపించినట్లు తెలుస్తోంది.

చాలామంది కొనుగోళ్లకు దూరంగా ఉండటంతో దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో వరుసగా.. రెండో రోజు కూడా బంగారం(Gold) ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఇప్పుడు కిందికి దిగిరావడం సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. అటు గ్లోబల్ మార్కెట్లోనూ గోల్డ్ రేటు ఔన్సుకు 30 డాలర్ల వరకూ క్షీణించి, ప్రస్తుతం 4,715 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

తాజా మార్కెట్ అప్‌డేట్స్ ప్రకారం, దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం(Gold) ధరపై రూ. 980 తగ్గగా, జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 900 వరకూ క్షీణించింది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే తులం బంగారంపై సుమారు 15 వేల రూపాయల వరకు భారీ తగ్గుదల కనిపించడం గమనార్హం.

ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,56,930 వద్దకు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1 లక్ష43వేల 850 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల రేటు రూ. 1లక్ష57వేల80గా ఉండగా, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో తెలుగు రాష్ట్రాలను ఫాలో అవుతూ రూ. 1లక్ష 56వేల 930 వద్ద స్థిరపడింది.

మరోవైపు బంగారంతో పోటీ పడుతూ సిల్వర్ కూడా రికార్డ్ స్థాయిలో పతనాన్ని చవి చూసింది. శుక్రవారం కిలో వెండిపై 10 వేల రూపాయలు తగ్గగా, శనివారం రోజు మార్కెట్లో మరో 15 వేల రూపాయలు పడిపోయింది. ఇలా గడిచిన 3 రోజుల్లోనే కిలో సిల్వర్‌పై ఏకంగా 30 వేల రూపాయల వరకూ భారీ తగ్గుదల నమోదైంది.

Gold
Gold

ఈ భారీ క్షీణత తర్వాత హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ , చెన్నై సిటీల్లో కిలో వెండి ధర రూ. 2లక్షల90 వేల మార్కుకు చేరింది. అదే సమయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మెట్రో సిటీలలో కిలో వెండి ధర రూ. 2లక్షల80వేల వద్ద ట్రేడవుతోంది.

అయితే అంతర్జాతీయ ఉద్రిక్తతలతో పాటు దేశీయ డిమాండ్‌ను బట్టి ఈ రేట్లు రోజంతా మారుతూ ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులు దీనిని గమనించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Shani Jayanti:13 ఏళ్ల తర్వాత అరుదైన శనిశ్చరి అమావాస్య..ఈరోజు ఇలా చేస్తే ఏలిననాటి శని బాధల నుంచి విముక్తి

Related Articles

Back to top button