Just SpiritualLatest News

Shani Jayanti:13 ఏళ్ల తర్వాత అరుదైన శనిశ్చరి అమావాస్య..ఈరోజు ఇలా చేస్తే ఏలిననాటి శని బాధల నుంచి విముక్తి

Shani Jayanti: రావి చెట్టుకు నీరు పోసి, చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆవాల నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా సకల శుభాలు చేకూరుతాయి.

Shani Jayanti

హిందూ ధర్మంలో మనుషుల కర్మఫల ప్రదాతగా, న్యాయదేవుడిగా పూజలందుకునే శనిదేవుడి జన్మదినాన్ని ప్రతి ఏటా జ్యేష్ఠ మాస అమావాస్య రోజు శని జయంతిగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే, ఈరోజు అంటే ఈ ఏడాది మే 16న వచ్చే శని జయంతి(Shani Jayanti)కి ఆధ్యాత్మికంగా ఒక అసాధారణమైన, అరుదైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. సుమారు 13 సంవత్సరాల తర్వాత శని జయంతి(Shani Jayanti) పర్వదినం శనివారం రోజే రావడం వల్ల, ఇది అత్యంత శక్తివంతమైన శనిశ్చరి అమావాస్య సంయోగంగా మారింది.

శనిదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన శని వారం రోజే ఆయన జయంతి రావడం జ్యోతిష్య శాస్త్ర రీత్యా అందరికీ మంచి ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. దీనికి తోడు, సుమారు 300 సంవత్సరాల తర్వాత ఈ రోజున సూర్య-బుధ సంయోగం వల్ల బుద్ధాదిత్య యోగంతో పాటు గజకేసరి యోగం, శశ మహాపురుష యోగం, సౌభాగ్య యోగం వంటి ఎన్నో అద్భుతమైన శుభ యోగాలు ఒకేసారి కలిసి రావడం ఈ రోజు విశిష్టతను మరింత పెంచింది. అదేవిధంగా ఇదే రోజు వివాహిత మహిళలు సౌభాగ్యం కోసం జరుపుకునే వట సావిత్రి వ్రతం కూడా రావడం మరో విశేషంగా నిలుస్తోంది.

ఈ అద్భుత పర్వదినం రోజు శని దేవుని అనుగ్రహం పొందడానికి, జాతకంలో ఉన్న ఏలిననాటి శని, అర్ధాష్టమ శని , శని మహాదశ వంటి దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం మంచిది. శని జయంతి రోజు ఉపవాసం ఉండలేని వారు కూడా ఈ పవిత్ర సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శని దేవుని కరుణ దొరుకుతుంది.

శనిదేవుని పూజను సాధారణంగా సాయంత్రం కానీ రాత్రి వేళల్లో కానీ చేయడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు. ఈ రోజు సాయంత్రం 07:05 గంటల నుంచి రాత్రి 08:23 గంటల వరకు పూజకు అత్యంత ఉత్తమమైన ముహూర్తంగా పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో శనిదేవుని ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులు, ఆవాల నూనెతో దీపారాధన చేయడం వల్ల జాతకంలోని శని దోషాల తీవ్రత తగ్గిపోతుంది. అలాగే శని దేవునికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు, నువ్వులు , ఇనుప వస్తువులను అవసరంలో ఉన్న పేదవారికి దానం చేయడం వల్ల కర్మ దోషాలు తొలగిపోయి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

గుడికి వెళ్లలేని వాళ్లు ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవాల నూనెను పోసి , అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి తూర్పు లేదా పడమర దిక్కుగా దీపారాధన చేయాలి. మీ దగ్గర శని దేవుని ఫోటో ఉంటే దానికి నీలి రంగు కానీ ఎరుపు రంగు పూలు కానీ సమర్పించొచ్చు. ఒకవేళ శని దేవుని ఫోటో ఇంట్లో లేకపోతే, శివుని ఫోటో కానీ హనుమంతుని ఫోటో ముందు కానీ ఈ దీపం వెలిగించినా సరిపోతుంది. ఎందుకంటే శివుడు శని దేవునికి గురువు, అలాగే హనుమంతుని పూజిస్తే శని దోషాలు అస్సలు దరిచేరవని పురాణాలు చెబుతాయి. దీపం వెలిగించిన తర్వాత ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

Shani Jayanti
Shani Jayanti

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుని ఆరాధన కూడా ఈ రోజు ఎంతో మేలు చేస్తుంది. శని జయంతి(Shani Jayanti )రోజు అంటే ఈరోజు హనుమాన్ చాలీసా , సుందరాకాండ పారాయణం వంటివి చేయడం వల్ల శని దేవుని పీడల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా, సాయంత్రం పూట రావి చెట్టుకు నీరు పోసి, చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆవాల నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా సకల శుభాలు చేకూరుతాయి.

శనిదేవుడు ఎప్పుడూ న్యాయాన్ని, కష్టపడే తత్వాన్ని మెచ్చుకుంటాడు కాబట్టి ఈ రోజు ఎవరినీ మోసం చేయకుండా, ముఖ్యంగా అనాథలను, వృద్ధులను గౌరవిస్తూ వారికి తోచిన సహాయం చేయడం ద్వారా శని ఆశీస్సులు లభిస్తాయి. 13 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అద్భుత శనివార సంయోగాన్ని సద్వినియోగం చేసుకుని భక్తితో పరిహారాలు పాటిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

Psychology :ఇతరులకు సలహాలు.. వారి జీవితం మాత్రం అస్తవ్యస్తం.. సైకాలజీ ఏం చెబుతుంది?

Related Articles

Back to top button