Just NationalLatest News

Indian Navy:ఇండియన్ నేవీలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..క్వాలిఫికేషన్, లాస్ట్ డేట్ వివరాలు ఇవే..

Indian Navy: అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఎజిమల ఇండియన్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విధుల్లోకి ప్రవేశిస్తారు.

Indian Navy

దేశానికి సేవ చేయాలనుకునే యువతకు ఇండియన్ నేవీలో(Indian Navy) ఒక అద్భుతమైన అవకాశం లభించింది. ఇండియన్ నేవల్ అకాడమీ 2027 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోర్సు ద్వారా ఉద్యోగాల భర్తీకి అర్హులైన పెళ్లికాని యువతీ యువకుల నుంచి అప్లికేషన్లను కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 15 ఐటీ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇండియన్ నేవీలో(Indian Navy) ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవగా.. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఎజిమల ఇండియన్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విధుల్లోకి ప్రవేశిస్తారు.

ఈ ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే క్యాండిడేట్లకు నిర్దేశిత విద్యార్హతలు ఉండాలి. అభ్యర్థులు తమ టెన్త్ లేదా ఇంటర్‌మీడియట్‌లో ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో పాస్ అవ్వాలి. దీంతో పాటు కనీసం 60 శాతం మార్కులతో బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులతో పాటు ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.

లేదంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ విద్యార్హత అయినా కలిగి ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా జనవరి 1, 2002 నుంచి జూలై 1, 2007 మధ్యలో జన్మించి ఉంటేనే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Navy
Indian Navy

ఈ నోటిఫికేషన్ లోని మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ ఉద్యోగాలకు ఎలాంటి రిటెన్ టెస్ట్ (Written Exam) ఉండదు. అభ్యర్థులు సాధించిన అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగానే వారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) నిర్వహించే ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ,మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

ఉద్యోగానికి సెలక్ట్ అయిన వారికి ప్రారంభంలోనే నెలకు రూ. 56,100 బేసిక్ పేతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. మొదటగా 10 సంవత్సరాల షార్ట్ సర్వీస్ కాలానికి వీరిని డ్యూటీలోకి తీసుకుంటారు, ఆ తర్వాత నేవీ అవసరాలను బట్టి వీరి సర్వీసును మరో 4 సంవత్సరాలు పొడిగించే ఛాన్స్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కేరళలో 6 వారాల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో అభ్యర్థులు పెళ్లి చేసుకోకూడదు అనే నిబంధన ఉంది, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని విధుల నుంచి తొలగిస్తారు.

ఎస్‌ఎస్‌సీ ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి.

https://www.joinindiannavy.gov.in/

Related Articles

Back to top button