Just Andhra PradeshJust LifestyleLatest News

Araku Valley: ప్రకృతి ఒడిలో అద్భుత ప్రపంచం ..సమ్మర్‌లో అరకు లోయ ట్రిప్‌కు వెళుతున్నారా?

Araku Valley : అరకు వెళ్లిన వారు అక్కడ దొరికే ఆర్గానిక్ కాఫీని రుచి చూడటమే కాకుండా, లోకల్ స్పెషల్ డిష్ అయిన బాంబూ చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు.

Araku Valley

ఏపీలోని విశాఖపట్నం మన్యం పరిధిలో ఉన్న అరకు లోయ (Araku Valley) టూరిస్టులను మంత్రముగ్ధులను చేసే ఒక అద్భుతమైన హిల్ స్టేషన్ అని తెలిసిందే. సముద్ర మట్టానికి దాదాపు 3 వేల అడుగుల ఎత్తులో, తూర్పు కనుమల మధ్య పచ్చటి తివాచీ పరిచినట్లుండే అరకు వ్యాలీ(Araku Valley).. ప్రకృతి ప్రేమికులకు ఏ సీజన్‌లో అయినా ఒక స్వర్గధామమే.

దట్టమైన పచ్చని అడవులు, కాఫీ తోటల సువాసనలు, కొండల పైనుంచి జాలువారే పాలనురుగులాంటి జలపాతాలు, శీతల వాతావరణం అరకు టూరిజం స్పెషాలిటీ. అయితే సమ్మర్‌లో కంటే శీతాకాలంలో ఉదయాన్నే దట్టమైన పొగమంచు దుప్పటిని కప్పుకునే అరకు కొండల అందాలను చూడటానికి.. దేశవిదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి చూడటానికి వస్తుంటారు.

విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే ఘాట్ రోడ్డు జర్నీ టూరిస్టులకు వారి జీవితంలోనే ఒక మరువలేని అనుభూతిని ఇస్తుంది. ఈ రూట్‌లో ప్రయాణించే విస్టాడోమ్ (Vistadome) ట్రైన్‌ జర్నీ చాలా ప్రత్యేకం. అద్దాల పైకప్పు ఉన్న ఈ ట్రైన్‌లో ప్రయాణిస్తూ, గుహలు, వంతెనలు , పచ్చటి లోయల అందాలను వీక్షించడం టూరిస్టులను మైమరపిస్తుంది.

Araku Valley
Araku Valley

అరకు వెళ్లిన వారు తప్పక చూడాల్సిన ప్రదేశాలలో బొర్రా గుహలు (Borra Caves) ప్రధానమైనవి. మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సున్నపురాయి గుహల్లోని స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్ ఆకృతులు ప్రకృతి నైపుణ్యానికి అద్దం పడుతుంటాయి. దీంతో పాటు పద్మాపురం గార్డెన్స్, చాపరాయి, కటికి జలపాతం వంటి ప్రదేశాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి.

అరకు టూరిజంలో ప్రకృతి అందాలతో పాటు అక్కడి గిరిజన కల్చర్, లైఫ్ స్టైల్‌ కూడా టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తాయి. స్థానికంగా ఉండే గిరిజనులు ప్రదర్శించే సాంప్రదాయ థింసా (Dhimsa) డ్యాన్స్ ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ప్రత్యేక వినోదాన్ని అందిస్తుంది.

Araku Valley
Araku Valley

అలాగే, ఇక్కడి గిరిజన మ్యూజియంలో వారి కల్చర్‌కి సంబంధించిన విశేషాలను తెలుసుకోవచ్చు. అరకు వెళ్లిన వారు అక్కడ దొరికే ఆర్గానిక్ కాఫీని రుచి చూడటమే కాకుండా, లోకల్ స్పెషల్ డిష్ అయిన బాంబూ చికెన్ (Bamboo Chicken) ను ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఉరుకుల పరుగుల సిటీ లైఫ్ టెన్షన్స్ నుంచి రిలీఫ్ పొంది, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి అరకు లోయను ఒక పర్ఫెక్ట్ టూరిజం డెస్టినేషన్ అని చెప్పొచ్చు.

Decision :చిన్న చిన్న నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటే నష్టమా? .. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి?

Related Articles

Back to top button