Just LifestyleLatest News

Mindset:అవసరం ఉన్నప్పుడే గుర్తొచ్చే అవకాశవాద మనస్తత్వం..ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిందే..

Mindset: బంధాలనేవి ఎప్పుడూ వ్యాపారం లాంటివి కావు. అవసరమున్నప్పుడు ప్రేమను నటించి పని చేయించుకోవడం మోసం కిందకే వస్తుంది.

Mindset

ఫోన్ రింగ్ అవ్వగానే స్క్రీన్ మీద అవతలి పేరు చూడగానే.. ఓహో వీళ్లకు మళ్లీ నాతో ఏదో అవసరం వచ్చిందన్నమాట అని మనకు ముందే అర్థమైపోతూ ఉంటుంది. ఇలా అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తొచ్చి, ఆ సమయంలో లేని ప్రేమను ఒలకబోస్తూ మాట్లాడతారు. తీరా ఆ అవసరం లేదా పని అయిపోగనే కనీసం ముఖం కూడా చూపించని మనుషులు మన చుట్టూ చాలా మందే ఉంటారు.

వాళ్లకు ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్లు మాట్లాడే తీరు చూస్తే.. మన కంటే ప్రాణ స్నేహితులు వాళ్ల జీవితంలో ఇక ఎవరూ లేరేమో అని మనకు మనమే ఒక భ్రమలో పడిపోతుంటాం. కానీ తీరా వాళ్ల అవసరం తీరిపోయాక, కనీసం ఒక చిన్న పలకరింపు కూడా ఉండదు.

నిజానికి సైకాలజీలో ఇలాంటి మైండ్ సెట్‌(Mindset)ను ఆపర్చునిస్టిక్ బిహేవియర్ అంటే అవకాశవాద ప్రవర్తన అని పిలుస్తారు. ఇలాంటి వారిని సొసైటీలో టాక్సిక్ పీపుల్ లేదా మనుషులను కేవలం వస్తువుల్లా వాడుకునే స్వార్థపరులు అంటూ ఉంటారు. వీరి బుద్ధెప్పుడూ కూడా నాకేంటి లాభం అనే ఆలోచన చుట్టూనే తిరుగుతుంది. వీరు ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకున్నా,చివరకు ఫ్రెండ్షిప్ చేసినా ప్రేమాభిమానాలను చూడరు, కేవలం అవతలి వ్యక్తి వల్ల తమకు ఏం ఉపయోగం ఉందో అని మాత్రమే లెక్కిస్తుంటారు.

ఒకవేళ మీది కూడా ఇలా అవసరం వచ్చినప్పుడే మనుషులు గుర్తొచ్చే మైండ్ సెట్‌(Mindset) ఏనా? అయితే ఒక్క క్షణం ఆగి మీ గుండె మీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చినట్లే. మీ స్వార్థం కోసం మీరు పలకరించినా కూడా, మిమ్మల్ని నమ్మి అవతలి వాళ్ల కళ్లల్లో ఒక చిన్న మెరుపు కనిపిస్తుంది కదా.. ఆ సంతోషం మీపై ఉన్న నిజమైన ప్రేమ వల్లే అని మీరు అర్ధం చేసుకోవాలి. ఎదుటి మనిషిని ఒక తోటి మనిషిలాగానే చూడటం అలవాటు చేసుకోవాలి. మీకు కావాల్సినప్పుడు ఆశ్రయించి, మీ పనైపోయాక కరివేపాకులా తీసి అవతల పారేసే ఒక ప్రాణం లేని వస్తువులా వాడుకోవద్దు.

బంధాలనేవి ఎప్పుడూ వ్యాపారం లాంటివి కావు. అవసరమున్నప్పుడు ప్రేమను నటించి పని చేయించుకోవడం మోసం కిందకే వస్తుంది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని నమ్మి(Mindset ), మీ మాటలకు విలువిచ్చి సహాయం చేసే మనుషులు అమాయకులు కాదు, మీకంటే చాలా గొప్ప మనసున్నవారు. వారి నమ్మకాన్ని వాడుకుని మీరు సాధించే పనులేవీ మీకు నిజమైన సంతోషాన్నివ్వవు.

Mindset
Mindset

రేపు మీకు నిజంగానే పెద్ద కష్టం వచ్చినప్పుడు, మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు.. మీరు గతంలో అవసరానికి వాడుకుని వదిలేసిన ఆ మనుషులే గుర్తుకువస్తారు. కానీ అప్పటికే ఆ బంధాలన్నీ తెగిపోయి ఉంటాయి కాబట్టి, చివరికి ఒంటరితనం మాత్రమే మిగులుతుంది. అందుకే అవసరం ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండటం నేర్చుకోండి ఎందుకంటే ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే మళ్లీ సంపాదించుకోవడం అసాధ్యం.

నిజానికి మనుషులు అన్న తర్వాత వారికి అవసరాలుంటాయి..అటువంటప్పుడు సహాయం అడగడం తప్పు కాదు, కానీ అవసరం తీరాక కూడా ఆ బంధాన్ని కాపాడుకోవడంలోనే ఆ మనిషి ఎలాంటి వారు అనేది అర్ధం అవుతుంది. జీవితంలో డబ్బు కంటే కూడా.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడే నలుగురు మంచి మనుషులను సంపాదించుకోవడమే అసలైన ఆస్తి అని తెలుసుకోవాలి. కాబట్టి, ఈరోజే మీలో ఉన్న అవకాశవాదాన్ని వదిలేసి, స్వచ్ఛమైన బంధాలకు విలువనివ్వడం మొదలుపెట్టండి.

H1B Visa : 60 రోజుల్లో కొత్త జాబ్ రావాల్సిందే..హెచ్1బీ వీసాదారుల కష్టాలు

Related Articles

Back to top button