Cockroach Janta Party : కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్..తగ్గేదే లేదంటూ మరో అకౌంట్
Cockroach Janta Party : కాక్రోచ్ జనతా పార్టీ... వినడానికి పేరు వింతగా ఉన్నా ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో దూసుకెళుతోంది
Cockroach Janta Party
ప్రస్తుతం ఓకొత్త రాజకీయ పార్టీ దేశంలో మారుమోగిపోతోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party )… వినడానికి పేరు వింతగా ఉన్నా ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దేశంలో నిరుద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. ఈ వివాదం నుంచే పుట్టుకొచ్చిందిఈ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).
సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా దేశంలో నిరుద్యోగ యువతను ఆకర్షిస్తూ ఆన్ లైన్ లో ఈ పార్టీ పుట్టుకొచ్చింది. ఇన్ స్టాలో కేవలం 4 రోజుల వ్యవధిలోనే 10 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. యువత పెద్ద ఎత్తున ఆ పార్టీని ఫాలో అవుతుండడంతో సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఏకంగా దేశంలో మోస్ట్ ఫాలోయింగ్ పార్టీగా పేరున్న బీజేపీని సైతం సీజేపీ దాటిందంటే దాని క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రం సీజేపీ ఎక్స్ ( ట్విట్టర్) ఖాతాను బ్లాక్ చేయించింది. కానీ కొద్ది సమయంలోనే కాక్రోచ్ జనతా పార్టీ మరో అకౌంట్ తో అందరి ముందుకు వచ్చింది. తద్వారా తగ్గేదే లేదంటూ కేంద్రానికి కౌంటర్ ఇచ్చినట్టయింది.
కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పేరుతో మరో అకౌంట్ ఓపెన్ చేసిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే దాన్ని ఎక్స్ లో షేర్ చేశారు. దీనికి నిమిషాల వ్యవధిలోనే ట్వీట్లు, రీ ట్వీట్లు వచ్చాయి. మా నుంచి తప్పించుకుందామనుకున్నారు కదూ పంచ్ వేయడంతో మరింత వైరల్ గా మారింది. తమ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేస్తుందని ముందే ఊహించినట్టు అభిజీత్ చెప్పారు.

సోషల్ మీడియా ఫాలోయింగ్ లో బీజేపీని దాటినందుకే బ్లాక్ చేసారని తెలిపారు. కాగా ఉద్యోగం దొరకని కొందరు యువకులు బొద్దింకలుగా మారి విమర్శలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే ఈ పార్టీ ఏర్పాటుకు కారణమైంది. నిరుద్యోగం , రూపాయి పతనం , పేపర్ లీకేజీ వంటి ఘటనలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతకు ఆయన వ్యాఖ్యలు మరింత కోపం తెప్పించాయి.
తమను బొద్దింకలుగా చూస్తే అవి ఏకమైతే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అభిజీత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో నేపాల్ తరహాలోనే మన దేశంలో కూడా జెన్ జీ ఉద్యమం మొదలయ్యేందుకు పునాది పడిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Eggs :గుడ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? రోజుకు ఎన్ని ఎగ్స్ తినాలి?





