Just SportsLatest News

Qualifier 1 : క్వాలిఫైయర్ 1కు వర్షం ముప్పు ?..ఒకవేళ రద్దయితే ఫైనల్ చేరేది ఆ జట్టే

Qualifier 1 : తొలి క్వాలిఫైయర్ టాప్ 2లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది

Qualifier 1

ఐపీఎల్ 19వ సీజన్ ప్లే ఆఫ్ స్టేజ్ కు వచ్చేసింది. మొత్తం 10 జట్ల నుంచి ఆరు ఇంటిదారి పడితే నాలుగు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాయి. ఇవాళ జరిగే తొలి క్వాలిఫైయర్(Qualifier 1) టాప్ 2లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు డైరెక్ట్ గా ఫైనల్ కు క్వాలిఫై అవుతుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.

ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది. ఇదిలా ఉంటే క్వాలిఫైయర్ 1కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. ధర్మశాలలో ఇవాళ 80 శాతం వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. అయితే మ్యాచ్ సమయంలో మాత్రం చిరుజల్లులు పడే ఛాన్సుందని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే, ఒకవేళ రద్దయితే ఏ జట్టు ఫైనల్ కు చేరుతుందనే దానిపై చర్చ మొదలైంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వాలిఫైయర్స్ కు రిజర్వ్ డే లేదు. వర్షం వల్ల ఒకవేళ మ్యాచ్ ను రద్దు చేస్తే లీగ్ స్టేజ్ లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టే ముందంజ వేస్తుంది.

దీని ప్రకారం చూస్తే లీగ్ స్టేజ్ ను ఆర్సీబీ టాప్ ప్లేస్ తో ముగించింది. గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో నిలిచింది. నిజానికి ఇరు జట్లు 14 మ్యాచ్ లలో 9 చొప్పున విజయాలతో 18 పాయింట్లు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ లో మెరుగ్గా ఉండడంతో బెంగళూరుకు అగ్రస్థానం దక్కింది. అందుకే లీగ్ స్టేజ్ లో చాలా జట్లు టాప్ ప్లేస్ టార్గెట్ గానే ఆడుతుంటాయి. ఒకవేళ కీలక మ్యాచ్ లలో వర్షం వల్ల ఇబ్బంది ఎదురైతే వారికి అడ్వాంటేజ్ ఉంటుంది.

Qualifier 1
Qualifier 1

ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2కి కూడా ఇదే రూల్ అమలవుతుంది. ఎలిమినేటర్ లో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించనుండగా ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ముందంజ వేస్తుంది., ఎందుకుంటే సన్ రైజర్స్ 9 విజయాలతో 18 పాయింట్లు సాధించగా.. రాజస్థాన్ 16 పాయింట్లే సాధించింది.

Gold Prices :దిగివచ్చిన బంగారం ధరలు..పుత్తడిని ఫాలో అయిన వెండి

Related Articles

Back to top button