Gold Prices :దిగివచ్చిన బంగారం ధరలు..పుత్తడిని ఫాలో అయిన వెండి
Gold Prices : బంగారంతో పాటే సిల్వర్ ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2.85 లక్షల వద్ద కొనసాగుతుంది.
Gold Prices
కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Prices) ఒక్కసారిగా దిగిరావడం గోల్డ్ లవర్స్‌కు మళ్లీ ఊరటనిచ్చింది. సోమవారం కూడా పెరిగిన రేట్లు, మంగళవారం రోజు డ్రాప్ అవడంతో మార్కెట్లో కొనుగోలుదారుల సందడి మళ్లీ మొదలైంది. పుత్తడితో పాటు సిల్వర్ ధరలు కూడా ఈరోజు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం సిటీలలో పది గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర.. మే 25తో పోలిస్తే రూ. 490 తగ్గి రూ. 1లక్ష58వేల 890 కి చేరుకుంది.
అలాగే సాధారణంగా ఆభరణాల తయారీకి వాడే ఇరవైరెండు క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 450 మేర పతనమై రూ. 1లక్ష45వేల650 వద్ద కొనసాగుతోంది.
ఇటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇవే ధరలు 24 క్యారెట్లు రూ. 1లక్ష58వేల890 , 22 క్యారెట్లు రూ. 1లక్ష45వేల650 నమోదయ్యాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం పుత్తడి ధరలు(Gold Prices) ఎప్పుడూ కొంచెం అదనంగానే ఉంటాయి. అక్కడ ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1లక్ష61 వేల250 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష47వేల810 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1లక్ష59వేల 40 కి చేరగా, 22 క్యారెట్ల రేటు రూ. 1లక్ష45వేల800 వద్ద స్థిరపడింది. సోమవారం ధరలతో పోల్చితే అక్కడ కూడా రూ. 490 వరకూ తగ్గుదల కనిపించింది.

బంగారంతో పాటే సిల్వర్ ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2.85 లక్షల వద్ద కొనసాగుతుంది.
ఇక ఐరన్ , సిల్వర్ మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండే చెన్నై , హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 2 లక్షల94వేల900 వద్ద కొనసాగుతుండగా, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ. 2 లక్షల84వేల900 గా ఉంది.
లోకల్ ట్యాక్స్‌లు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోపాటు ఆయా నగరాలలోని డిమాండ్‌ను బట్టి ..ఈ ధరలలో కొద్దిగా మార్పులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
DK Shivakumar : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ ?..హైకమాండ్ వరుస భేటీలతో టెన్షన్





