HealthJust LifestyleLatest News

Collagen : యవ్వనానికి, కొల్లాజెన్‌కు సంబంధం ఏంటి? దీనిని ఆహారం ద్వారా పొందొచ్చా?

Collagen : స్కిన్, ఎముకలు, కండరాలు, జాయింట్లు, రక్తం ప్రవహించే నరాలు, చివరికి మన గోళ్లు, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కొల్లాజెన్ ముఖ్య కారణం.

Collagen

మన స్కిన్ ఎప్పుడూ మెరుస్తూ యవ్వనంగా కనిపించాలన్నా, వయసు పెరిగినా కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలన్నా మన బాడీలో ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఉండాలి. దాని పేరే కొల్లాజెన్ (Collagen). దీని గురించి మనం రోజూ ఎన్నో బ్యూటీ టిప్స్‌లో, హెల్త్ ఆర్టికల్స్‌లో వింటూ ఉంటాం. అయితే అసలు కొల్లాజెన్ అంటే ఏంటి? ఇది మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందన్న విషయం ఇంకా చాలామందికి తెలియదు.

మన బాడీలో నేచురల్‌గా తయారయ్యే ఒక రకమైన జిగురు లాంటి ప్రోటీనే ఈ కొల్లాజెన్(Collagen) . మన ఒంట్లో ఉండే మొత్తం ప్రోటీన్లలో దాదాపు ముప్పై శాతం ఇదే ఉంటుంది. ఇది బాడీలోని వివిధ భాగాలను, కణాలను ఒకదానితో ఒకటి గట్టిగా పట్టి ఉంచే బంక లాగా పనిచేస్తుంది. మన స్కిన్, ఎముకలు, కండరాలు, జాయింట్లు, రక్తం ప్రవహించే నరాలు, చివరికి మన గోళ్లు, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్రోటీనే ముఖ్య కారణం.

మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన బాడీ కొల్లాజెన్‌ను చాలా ఎక్కువగా తయారు చేస్తుంది. అందుకే చిన్నపిల్లల స్కిన్ అంత మెరుస్తూ, సాఫ్ట్‌గా, టైట్‌గా ఉంటుంది. స్కిన్ సాగిపోకుండా, ముడతలు పడకుండా కాపాడే బాధ్యత కొల్లాజెన్(Collagen) తీసుకుంటుంది. అయితే వయసు 25 దాటినప్పటి నుంచి ప్రతి ఏడాది మన బాడీలో కొల్లాజెన్ తయారవ్వడం కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. దీని వల్లే వయసు పెరిగే కొద్దీ స్కిన్‌పై ముడతలు రావడం, కంటి కింద చర్మం వేలాడటం, ముఖంలో గ్లో తగ్గడం వంటివి జరుగుతాయి.

కొల్లాజెన్ అనేది కేవలం అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఇంపార్టెంట్. మన కీళ్లలో (Joints) ఉండే ఎముకలు ఒకదానికొకటి రాసుకోకుండా ఉండటానికి కార్టిలేజ్ అనే ఒక మెత్తటి భాగం ఉంటుంది. ఈ కార్టిలేజ్ తయారవ్వడానికి కొల్లాజెన్ చాలా అవసరం. బాడీలో కొల్లాజెన్ తగ్గిపోతే కీళ్ల మధ్య ఉండే జిగురు తగ్గిపోయి, ఎముకలు అరిగిపోయి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి.

వయసు పెరగడంతో పాటు మనం చేసే కొన్ని తప్పుల వల్ల కూడా బాడీలో కొల్లాజెన్ చాలా వేగంగా నశించిపోతుంది. ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఉండటం వల్ల ఆ యూవీ కిరణాలు చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. అలాగే ఎక్కువగా స్మోకింగ్ చేయడం, జంక్ ఫుడ్స్, పంచదార ఎక్కువగా ఉండే స్వీట్లు తినడం వల్ల కూడా కొల్లాజెన్ లెవెల్స్ పడిపోతాయి.

Collagen
Collagen

మనం రోజూ తినే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా బాడీలో కొల్లాజెన్‌ను మళ్లీ పెంచుకోవచ్చు. దీనికోసం విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మకాయలు, నారింజ, బత్తాయి, ఉసిరి లాంటి పండ్లను ఎక్కువగా తినాలి.

ఇవి బాడీలో కొల్లాజెన్ తయారవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే గుడ్లు, చికెన్, చేపలు, పాలు, బాదం, జీడిపప్పు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, టమోటాలు కూడా చాలా మంచివి. మార్కెట్లో కొల్లాజెన్ పౌడర్లు, టాబ్లెట్లు కూడా దొరుకుతున్నాయి. కానీ వాటిని వాడే ముందు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది.

TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..2 నుంచి 4 గంటల్లోనే స్వామివారి దర్శనం

Related Articles

Back to top button