Just TelanganaJust PoliticalLatest News

Unemployed : నిరుద్యోగులకు సర్కారు బంపర్ ఆఫర్.. 6వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

Unemployed : దేవాదాయ, అటవీ, సర్వే సెటిల్‌మెంట్ , పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో (DIET) వందకు పైగా అధ్యాపక పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

Unemployed

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు(Unemployed )తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. ఇటీవలే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి ఏకంగా 44 ఏళ్లకు పెంచిన సర్కారు.. ఇప్పుడు ఖాళీల భర్తీ ప్రక్రియను స్పీడప్ చేయడానికి అడుగులు వేస్తోంది.

వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఖాళీల వివరాలను పూర్తిగా సమీక్షించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పాలక మండలి అతి త్వరలోనే ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని వివిధ విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో భర్తీ కానున్న ఖాళీల వివరాలను ఒకసారి చూస్తే.. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో వెయ్యికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మరో 3 వందలకు పైగా లెక్చరర్ ఉద్యోగాలు ఉన్నాయి.

వీటితో పాటు దేవాదాయ, అటవీ, సర్వే సెటిల్‌మెంట్ , పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో (DIET) వందకు పైగా అధ్యాపక పోస్టులు భర్తీ కాబోతున్నాయి. జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల (PET) ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు.

కాగా రవాణా , స్థానిక సంస్థల విషయానికి వస్తే, తెలంగాణ ఆర్టీసీలో ఉన్న పోస్టుల భర్తీ కోసం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పటికే కమిషన్‌కు లేఖ రాయగా.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఉద్యోగ పరీక్షల నిర్వహణలో ఈసారి టీజీపీఎస్సీ ఒక సరికొత్త , అభ్యర్థులకు అనుకూలమైన విధానాన్ని తీసుకురాబోతోంది. ఒకే సమయంలో 2 వేర్వేరు పరీక్షలు రావడం వల్ల నిరుద్యోగులు(Unemployed) ఇబ్బంది పడకుండా కమిషన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇతర రాష్ట్ర స్థాయి బోర్డుల ఎగ్జామ్స్, అలాగే యూపీఎస్సీ (UPSC), ఎస్ఎస్‌సీ (SSC) వంటి జాతీయ స్థాయి ఎగ్జామ్ డేట్స్‌ను ముందే పరిశీలించి, అందరూ ప్రశాంతంగా హాజరయ్యేలా షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే అన్ని నోటిఫికేషన్లను ఒకేసారి కాకుండా.. ప్రతి 2 వారాలకొకటి చొప్పున రిలీజ్ చేయాలని కమిషన్ భావిస్తోంది.

Unemployed
Unemployed

దీనివల్ల అర్హత ఉన్న కేండిడేట్స్ ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎలాంటి సందేహం లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ఆర్థిక శాఖ పర్మిషన్ ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు.

రాబోయే కొత్త నోటిఫికేషన్లకు అప్లై చేయాలనుకునే కేండిడేట్స్ తప్పనిసరిగా తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉన్నా.. వారిలో కేవలం 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్‌గా ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ మిగిలిన వారంతా ఆలస్యం చేయకుండా వెంటనే తమ ఓటీఆర్ ప్రొఫైల్‌ను సరిచేసుకోవాలని కమిషన్ ఆదేశించింది.

Peddi : పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తి.. చీఫ్‌ గెస్ట్‌గా ఆ హీరో వస్తున్నారా?

Related Articles

Back to top button