Just EntertainmentLatest News

Peddi Box Office : మెగా పవర్ స్టార్ వన్ మ్యాన్ షో.. పెద్ది బాక్సాఫీస్ విధ్వంసం

Peddi Box Office : విదేశాల్లోనూ పెద్ది జోరు కొనసాగుతోంది. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ మూవీ ఇప్పటివరకు 2.7 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు

Peddi Box Office

పెద్ది మూవీతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటించిన తాజా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ మూవీలో చరణ్ క్రికెటర్, కుస్తీ యోధుడు, కూలీ వంటి డిఫరెంట్ గెటప్స్‌లో తన విశ్వరూపాన్ని చూపించడంతో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మెగా హీరో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ షో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుండటంతో భారీ స్థాయిలో వసూళ్లు నమోదవుతున్నాయి.

జూన్ 4న గురువారం వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ మూవీ మొదటి రోజే రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండో రోజు వసూళ్లలో కొద్దిగా మార్పు కనిపించినా, శని, ఆదివారాల్లో మాత్రం బాక్సాఫీస్(Peddi Box Office) వద్ద పెద్ద ప్రభంజనాన్నే సృష్టించింది.

ఈ వీకెండ్‌లో 200 కోట్ల మార్కును క్రాస్ చేస్తుందని అంచనా వేసిన ట్రేడ్ వర్గాలకు.. వీకెండ్ జోష్‌ను యాడ్ చేసుకుని కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌కు అత్యంత చేరువలో అంటే రూ. 292.5 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

Peddi Box Office
Peddi Box Office

దీంతో అఫీషియల్ వసూళ్ల వివరాలను ప్రకటిస్తూ ప్రొడ్యూసర్లు ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే, వీకెండ్ ముగిసి సోమవారం వీక్ డేస్ ప్రారంభం కావడం, అలాగే స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కావడంతో ఈ మూవీ కలెక్షన్లపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరోవైపు విదేశాల్లోనూ పెద్ది జోరు కొనసాగుతోంది. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ మూవీ ఇప్పటివరకు 2.7 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించారు.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు , రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య , అజయ్ ఘోష్ వంటి ఫేమస్ యాక్టర్లు కీలక పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఈ మూవీకి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.

Aries : మేషరాశి వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? వారి ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

జస్ట్ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button