Just SportsLatest News

T20 World Cup : అమ్మాయిలు అదరగొడతారా ?..టీ20 ప్రపంచకప్ కు రెడీ

T20 World Cup : వన్డేల్లో మెరుగ్గానే రాణిస్తున్న భారత మహిళల జట్టు టీ20ల్లో మాత్రం అనుకున్న రీతిలో ఆడడం లేదు

T20 World Cup

మహిళల క్రికెట్ లో వన్డే రారాణులుగా ఉన్న భారత జట్టు ఇప్పుడు మరో సవాల్ కు సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరగబోతున్న మహిళల టీ20 ప్రపంచకప్(T20 World Cup) లో ఛాంపియన్ గా నిలవడమే లక్ష్యంగా సన్నద్ధమైంది. జూన్ 12 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup) టైటిల్ రేసులో భారత్ కూడా ఉంది. గత టోర్నీల్లో నిరాశపరిచినా ఈసారి మాత్రం అంచనాలు పెరిగాయి. దీనికి కారణం గత ఏడాది వన్డే ప్రపంచకప్ లో విజేతగా నిలవడమే.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి మేటి జట్లను నిలువరించి వన్డేల్లో ఛాంపియన్ గా నిలిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు తమకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup) ను కూడా గెలవాలని పట్టుదలగా ఉంది. 2009 నుంచి 2024 వరకూ నాలుగు సార్లు సెమీఫైనల్స్ చేరిన భారత్ ఒకసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

2020లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న హర్మన్ ప్రీత్ సేన ఇప్పుడు అంచనాలతో బరిలోకి దిగుతోంది. వన్డేల్లో మెరుగ్గానే రాణిస్తున్న భారత మహిళల జట్టు టీ20ల్లో మాత్రం అనుకున్న రీతిలో ఆడడం లేదు.గత కొన్ని సిరీస్ లలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. శ్రీలంక, ఆసీస్ జట్లపై సిరీస్ లు గెలిచినా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లపై పరాజయాలు చవిచూసింది.

ఈ మెగా టోర్నీ కోసం భారత మహిళల జట్టును చూస్తే బ్యాటింగ్ లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఓపెనర్లుగా మెరుపు ఆరంభాలనిస్తే తిరుగుండదు. ముఖ్యంగా లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ వన్డే ప్రపంచకప్ లో ఎలాంటి ఇన్నింగ్స్ లు ఆడిందో అందరూ చూసారు. ఇప్పుడు పొట్టి ఫార్మాట్ లో కూడా షెఫాలీ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

స్మృతి కూడా ఫామ్ అందుకోవడం, హర్మన్ ప్రీత్ అనుభవం టీమిండియాకు కలిసొచ్చే అంశాలు. యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఫినిషర్ రోల్ లో రిచా ఘోష్ పై మంచి అంచనాలున్నాయి. అటు బౌలింగ్ లో మాత్రం మెరుగవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంగ్లాండ్ పిచ్ లపై మన పేసర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి పరుగులు నియంత్రించలేకపోతుండడం ఇబ్బందిగా మారింది.

అటు స్పిన్నర్లు మాత్రం రాణిస్తున్నారు.శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ లకు తోడు దీప్తి శర్మ, శ్రీచరణిలతో స్పిన్ విభాగం బలంగా ఉంది. స్పిన్ కు అంత అనుకూలించని ఇంగ్లీష్ పిచ్ లపై వీరు మ్యాజిక్ చేయగలిగితే భారత్ కు ఎదురులేనట్టే. పాకిస్తాన్ తో జూన్ 14న జరిగే మ్యాచ్ తో భారత జట్టు టైటిల్ వేట మొదలవుతుంది.

NBK 111 : బాలయ్య బర్త్ డే బ్లాస్టర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న NBK 111 గ్లింప్స్

Related Articles

Back to top button