Just BusinessLatest News

Gold Price : దిగివస్తున్న పసిడి ధర..త్వరలోనే లక్ష దిగువకు..?

Gold Price : అమెరికన్ డాలర్ విలువ పెరిగినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతాయి. డాలర్ బలపడటం వల్ల విదేశీ కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారుతుంది

Gold Price

బంగారం ధరలు దిగొస్తున్నాయి. దాదాపు ఏడాది నుంచి పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న గోల్డ్ రేట్లు(Gold Price) ఇప్పుడు తిరోగమనం దిశగా సాగుతున్నాయి. ఒకటిరెండు సార్లు కాదు దాదాపు వారం రోజుల నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,640గా ఉంది. నిన్న 5390 రూపాయలు తగ్గిన గోల్డ్ రేట్ ఇవాళ 2340 రూపాయలకు తగ్గింది.

గత వారం నుంచి పసిడి ధర(Gold Price) తగ్గుతూ వస్తోంది. దాదాపు 12 వేలకు పైగా తగ్గింది. రెండు రోజుల్లోనే రూ.6900 వరకూ తగ్గింది. ప్రస్తుతం ఆరు నెలల గరిష్టానికి గోల్డ్ రేట్లు దిగి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ లో దాదాపుగా ఇవే రేట్లు ఉండగా.. ఇంకా తగ్గొచ్చని చెబుతున్నారు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం జూన్ నెలాఖరు నాటికి 10 గ్రాముల బంగారం ధర లక్ష దిగువకు రావొచ్చని చెబుతున్నారు.

దీంతో ఇప్పటికిప్పుడే బంగారం కొనేవారు కొన్ని రోజులు ఆగితే మంచిదని సూచిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 150 డాలర్లు తగ్గింది. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా డాలర్ బలోపేతం కావడం ప్రధాన కారణం. అలాగే ముడి చమురు ధరలు పెరగడంతో బంగారం, వెండి మార్కెట్లపై ఒత్తిడి పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.

అమెరికన్ డాలర్ విలువ పెరిగినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు(Gold Price) తగ్గుతాయి. డాలర్ బలపడటం వల్ల విదేశీ కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ పడిపోతుంది. ఇదిలా ఉంటే అమెరికాలో బలమైన ఉపాధి , ఆర్థిక పరిస్థితుల కారణంగా, వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.

Gold Price
Gold Price

బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి, బ్యాంక్ డిపాజిట్లు లేదా బాండ్ల ద్వారా ఎక్కువ రాబడి వచ్చే ఆస్తుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు. దీంతో గోల్డ్ కు డిమాండ్ తగ్గింది. ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు వంటి ఇతర పెట్టుబడులపై ఆకర్షణ పెరుగుతుంది.

దీంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ బంగారాన్ని విక్రయించి ఇతర చోట్ల పెట్టుబడి పెడతారు. ఇది కూడా ఒక కారణం.మొత్తానికి అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జూన్ నెల చివరికి తులం బంగారం ధర రూ.లక్షకు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Black Coffee : ఫ్యాటీ లివర్‌కు బ్లాక్ కాఫీ అమృతమే.. అయినా ఇన్‌స్టెంట్ కాఫీ పౌడర్ ఎందుకు వద్దు?

Related Articles

Back to top button