Just SportsLatest News

Women’s T20 World Cup : అమ్మాయిల ధనాధన్..నేటి నుంచే టీ20 ప్రపంచకప్

Women's T20 World Cup : శుక్రవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ క్రికెట్ పండుగ మొదలవుతుంది

Women’s T20 World Cup

మొన్నటి వరకూ ఐపీఎల్ హంగామాను ఆస్వాదించిన క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి మరో మెగాటోర్నీ వచ్చేసింది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్(Women’s T20 World Cup) షురూ కాబోతోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లకు దీటుగా వన్డే ఛాంపియన్ భారత మహిళల జట్టు టైటిల్ రేసులో దూసుకెళుతోంది.

మరి ధనాధన్ క్రికెట్ లో తమకు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ప్రపంచకప్ ను భారత్ అందుకుంటుందా… లేక టైటిల్ ఫేవరెట్స్ ఆతిథ్య ఇంగ్లాండ్, ఆసీస్, కివీస్, సఫారీలలో ఒక జట్టు ట్రోఫీ ఎగరేసుకుపోతుందా అనేది చూడాలి. గత కొన్నేళ్లుగా మహిళల క్రికెట్ కు ఆదరణ బాగా పెరిగింది. పురుషుల క్రికెట్ స్థాయిలో మహిళల క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు వీక్షిస్తున్నారు.

అందుకే వన్డే ప్రపంచకప్ కు సైతం మంచి ఫాలోయింగ్ వచ్చింది. డబ్ల్యూపీఎల్ కు సైతం వ్యూవర్ షిప్ పెరిగింది. ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్(Women’s T20 World Cup) పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐసీసీ ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మెగా టోర్నమెంట్‌లో ఈసారి రికార్డు స్థాయిలో 12 జట్లు తలపడుతున్నాయి.

శుక్రవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ క్రికెట్ పండుగ మొదలవుతుంది. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1 లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ , వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్.

జట్లు చోటు దక్కించుకున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపుల్లోనూ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జూలై 5న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Women's T20 World Cup
Women’s T20 World Cup

ఇటీవలే వన్డే ప్రపంచకప్ గెలిచిన జోష్‌తో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు పొట్టి ఫార్మాట్ లోనూ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. అదే జరిగితే ఏకకాలంలో వన్డే, టీ20 ప్రపంచకప్(T20 World Cup) గెలిచిన జట్టుగా ఘనత సాధిస్తుంది. గతంలో ఆసీస్ మాత్రమే ఈ ఘనత సాధించింది.

కాగా మహిళల క్రికెట్ కు క్రేజ్ బాగా పెరిగిన సందర్భంలో అటు ఐసీసీ కూడా ఈ మెగాటోర్నీ కోసం భారీ ప్రైజ్ మనీని కేటాయించింది. మొత్తం టోర్నీ కోసం రూ.82 కోట్ల ప్రైజ్ మనీ కేటాయించారు. గత ఎడిషన్ కంటే ఇది 10 శాతం ఎక్కువ. ట్రోఫీ గెలిచిన జట్టుకు రూ.21.8 కోట్లు, రన్నరప్ కు 10 కోట్లు అందజేయనున్నారు.

Cancer : సున్నితమైన మనసు తరచూ మారే మూడ్స్.. కర్కాటకరాశికి ఏ నెంబర్ కలిసి వస్తుంది?

Related Articles

Back to top button