Just InternationalLatest News

Mysterious Village : అక్కడకు వెళ్తే నో రిటర్న్.. ప్రపంచంలోని మోస్ట్ మిస్టీరియస్ గ్రామం..

Mysterious Village : బ్రెజిల్‌లోని ఒక మారుమూల ద్వీపంలో మారజో అనే ఒక విచిత్రమైన గ్రామం ఉంది. అక్కడికి ఎవరైనా సరే వెళ్లొచ్చు..

Mysterious Village

ఈ ప్రపంచంలో మనం ఊహించని ఎన్నో వింతలు, విశేషాలు, మిస్టరీలు దాగి ఉన్నాయి. మనం ఏదైనా కొత్త ఊరికి వెళ్తే, అక్కడ విశేషాలన్నీ చూసి హ్యాపీగా అక్కడి విషయాలను నెమరువేసుకుంటూ.. మళ్లీ మన ఇంటికి తిరిగి వచ్చేస్తాం.

అయితే బ్రెజిల్‌లోని ఒక మారుమూల ద్వీపంలో మారజో అనే ఒక విచిత్రమైన గ్రామం ఉంది. అక్కడికి ఎవరైనా సరే వెళ్లొచ్చు.. కానీ, ఒక్కసారి ఆ ఊరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత, తిరిగి మళ్లీ బయటి ప్రపంచంలోకి రాకూడదనే ఒక షాకింగ్ రూల్ అక్కడ ఉంది. వినడానికి సినిమా కథలా అనిపించినా, ఈ ప్రపంచంలో ఇలాంటి కొన్ని తెగలు, కొన్ని నిషేధిత ప్రాంతాల వెనుక నమ్మలేని నిజాలు చాలానే ఉన్నాయి.

మారజోలో నివసించే ఒక పురాతన తెగ ప్రజలు..నేటి ఆధునిక ప్రపంచాన్ని, టెక్నాలజీని అస్సలు ఇష్టపడరు. వాళ్లు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు. ఒకవేళ ఎవరైనా కొత్తవాళ్లు వాళ్ల కల్చర్, లివింగ్ స్టైల్ చూసి ఇష్టపడి ఆ గ్రామంలోకి వెళ్లాలనుకుంటే మాత్రం.. వాళ్లు ఒక కండిషన్‌కు ఒప్పుకోవాలి.

అక్కడికి వెళ్లినవాళ్లు జీవితాంతం ఆ ఊరిలోనే ఉండిపోవడంతో పాటు బయటి ప్రపంచంతో అన్ని బంధాలనూ తెంచేసుకోవాలి. ఒకవేళ లోపలికి వెళ్లాక మనసు మార్చుకుని ఎవరైనా రూల్ బ్రేక్ చేసి పారిపోవడానికి ట్రై చేస్తే, వాళ్లను ఆ తెగ ప్రజలు బందీలుగా మార్చేస్తారు. తమ సంప్రదాయాలను, సీక్రెట్స్‌ను బయటి ప్రపంచానికి తెలియకుండా దాచడానికే వాళ్లు ఈ కఠినమైన నిబంధనలను పెట్టుకున్నారు.

ఇలాంటి వింతలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి. అండమాన్ దీవుల్లోని నార్త్ సెంటినెల్ ఐలాండ్‌కి వెళ్లడం చట్టరీత్యా నేరం. ఎందుకంటే అక్కడ ఉంటున్న సెంటినలీస్ తెగ ప్రజలు బయటివారిని ఎవరినీ రానివ్వరు. చివరకు డ్రోన్లు , హెలికాప్టర్ల ద్వారా వాళ్లను గమనించినా కూడా బాణాలతో దాడి చేస్తారు.

కొన్ని వేల ఏళ్లుగా వాళ్లు బయట ప్రపంచానికి దూరంగా, ఒక వింత ఐసోలేషన్‌లో బతుకుతున్నారు. బయట మనుషుల వల్ల తమకు ఏవైనా రోగాలు వస్తాయేమోననే భయం కూడా వారిలో ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా నిషేధిత జోన్‌గా ప్రకటించింది.

Mysterious Village
Mysterious Village

అలాగే ఆఫ్రికాలోని కొన్ని తెగల్లో కొన్ని విచిత్రమైన ఆచారాలు కనిపిస్తుంటాయి. కొన్ని ఊర్లలోకి అడుగుపెట్టేటప్పుడు వాళ్ల దేవుళ్లకు ఆ వ్యక్తుల రక్తాన్ని నైవేద్యంగా ఇవ్వాలనే రూల్స్ ఉంటాయి.

టెక్నాలజీ డెవలప్ అయి, మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఈ రోజుల్లోనూ.. భూమి మీద ఇంకా కొన్ని ప్రాంతాలు మాత్రం ఇలాంటి వింత నమ్మకాలు, కఠినమైన రూల్స్ వెనుక దాగి ఉంటున్నాయి.

Earth : బ్రెయిన్ కంటే పవర్‌ఫుల్ నెట్‌వర్క్ భూమి లోపల ఉందా? ఇది మనుషుల్ని ఎంతలా కాపాడుతుందో తెలుసా?

Related Articles

Back to top button