Asian Games 2026 : హిస్టరీ రీరిటెన్- ఒకే దెబ్బకు 75 పతకాలు..పతకాల పట్టికలో పవర్ చూపిస్తున్న అథ్లెట్లు
Asian Games 2026 : ఆర్చరీ, బాక్సింగ్ కేటగిరీలలో హిస్టరీని తిరగరాసేలా స్వర్ణాలు కొల్లగొట్టడంతో భారత్ పతకాల సంఖ్య ఏకంగా 75కి చేరింది.
Asian Games 2026
ఆసియా క్రీడలు 2026(Asian Games 2026) వేదికగా భారత అథ్లెట్లు క్రియేట్ చేస్తున్న రికార్డుల సునామీకి ప్రత్యర్థులు విలవిలలాడుతున్నారు. రికార్డులను రీ రైట్ చేయడమే టార్గెట్‌గా మైదానంలో దిగుతున్న భారత అథ్లెట్లు పతకాల పంటను పండిస్తున్నారు. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి భయంకరమైన రికార్డులు ఉన్నా సరే, భారత వీరుల దెబ్బకు మోకరిల్లక తప్పడం లేదు. ఆర్చరీ, బాక్సింగ్ కేటగిరీలలో హిస్టరీని తిరగరాసేలా స్వర్ణాలు కొల్లగొట్టడంతో భారత్ పతకాల సంఖ్య ఏకంగా 75కి చేరింది. దీనిలో ఏకంగా 15 పసిడి పతకాలు ఉండటం విశేషం.
ఆర్చరీలో మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఒక అద్భుతమైన హిస్టరీకి వేదికైంది. అంకితా భకత్, కీర్తి, కుంకుమ్ మోహోద్లతో దిగిన భారత లేడీ పవర్.. ఫైనల్ మ్యాచ్‌లో పారిస్ ఒలింపిక్స్ ఛాంపియన్ , పవర్ఫుల్ దక్షిణ కొరియా టీమ్‌కు ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. టఫ్ ఫైట్‌లో కొరియాను చిత్తు చేసి ఆసియా గేమ్స్(Asian Games 2026) హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసి రికార్డుల పుటలెక్కింది. ఇదే ఆర్చరీలో రికర్వ్ మిక్స్డ్ జట్టు, మెన్ రికర్వ్ టీమ్స్ కూడా ఆకట్టుకునే ప్రదర్శనతో రజత పతకాలను సాధించాయి.
బాక్సింగ్ రింగ్‌లో కూడా భారత్ తన పంచ్ పవర్ ఏంటో ఆసియా ఖండానికి తెలిసొచ్చేలా చేసింది. మహిళల 65 కేజీల కేటగిరీలో పర్వీన్ హుడా తన ప్రత్యర్థిపై విరుచుకుపడి గోల్డ్ సాధించగా, 75 కేజీల కేటగిరీలో గర్జించిన లవ్లీనా బోర్గోహైన్ పసిడి పంచ్‌తో స్వర్ణాన్ని ఫిక్స్ చేసింది.

ఒకే ఏషియన్ గేమ్స్‌లో ఇద్దరు భారత మహిళా బాక్సర్లు గోల్డ్ మెడల్స్ గెలవడం క్రీడల చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. మరోవైపు రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో సుజీత్ సత్తా చాటి ఫైనల్‌కు దూసుకుని వెళ్లగా, సెపక్తక్రా పురుషుల క్వాడ్రంట్ టీమ్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.
ప్రస్తుతం భారత్ అకౌంట్లో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 75 మెడల్స్ ఉండగా, పాయింట్ల పట్టికలో భారత్ సగర్వంగా ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాసేపట్లో జరగబోయే హై-వోల్టేజ్ మహిళల హాకీ ఫైనల్ మ్యాచ్‌లో గోల్డ్ మెడల్ కోసం భారత టీమ్ చిరకాల ప్రత్యర్థి చైనాతో తలపడబోతోంది. మన అమ్మాయిలు కనుక అక్కడ కూడా స్వర్ణం కొడితే మెడల్స్ సంఖ్య కొత్త రికార్డులను సెట్ చేయడం గ్యారంటీ.
Potatoes In The Fridge : ఫ్రిడ్జ్‌లో ఆలుగడ్డలు పెడుతున్నారా? అయితే మీరిది తప్పకుండా చదవాల్సిందే..





