Mr Beast : వందల కోట్ల రూపాయలు సంపాదించడమే కాదు ధాతృత్వంలోనూ మిస్టర్ బీస్ట్ తనదైన ముద్ర వేస్తున్నాడు.
Mr Beast : మిస్టర్ బీస్ట్ అరుదైన రికార్డు అందుకున్నాడు. 500 మిలియన్ల సబ్ స్క్రైబర్లను దాటిన ఏకైక యూట్యూబర్ గా నిలిచాడు
Mr Beast
మిస్టర్ బీస్ట్…యూట్యూబ్ ను ఫాలో అయ్యేవారికి ఈ పేరు పరిచయం అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న అమెరికన్ యూట్యూబర్. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కంటెంట్ క్రియేటర్ గా అతనికి ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదు. తక్కువ సమయంలో అత్యంత ఆదరణ పొందడం మిస్టర్ బీస్ట్(Mr Beast) కే సాధ్యమైంది.
తాజాగా మిస్టర్ బీస్ట్(Mr Beast) అరుదైన రికార్డు అందుకున్నాడు. 500 మిలియన్ల సబ్ స్క్రైబర్లను దాటిన ఏకైక యూట్యూబర్ గా నిలిచాడు. అంటే మన లెక్క ప్రకారం అక్షరాలా 50 కోట్ల మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత మరెవ్వరికీ సాధ్యం కాలేదు. అమెరికాకు చెందిన మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్ సన్.
2012లో మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ప్రయాణం మొదలైంది. ఆరంభంలో అందరిలానే కష్టనష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే 2017లో చేసిన 100,000 వరకు లెక్కించడం అనే వీడియో వైరల్ కావడంతో ఆయన క్రేజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి వీడియోలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అది కూడా చాలా తక్కువ టైమ్ లో పాపులర్ అయ్యాడు.
భారీ బడ్జెట్తో కూడిన సాహసాలు , ఆకట్టుకునే సవాళ్లు, కోట్ల రూపాయల నగదు బహుమతులు ఇవ్వడం ద్వారా మిస్టర్ బీస్ట్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందాయి.వందలాది కోట్ల రూపాయలు సంపాదించడమే కాదు దాతృత్వంలోనూ మిస్టర్ బీస్ట్(Mr Beast) తనదైన ముద్ర వేస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం ఛారిటీలకే విరాళంగా ఇస్తున్నాడు.

ఈ ఛారిటీ ద్వారా అనాథ శరణాలయాలు, నిరాశ్రయులకు ఆహారం, వస్త్రాలు, వైద్య సహాయం అందించడం , పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇవ్వడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ స్థాయి క్యాంపెయిన్లను నిర్వహించి మిలియన్ల కొద్దీ చెట్లను నాటడం, సముద్రాలను శుభ్రం చేయడం లాంటివి కూడా చేశాడు.
ఘనా మేక్ ఎ డిఫరెన్స్ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థతో కలిసి గుండె జబ్బులున్న పిల్లలకు సర్జరీలు చేసేందుకు వీలుగా అత్యాధునిక సదుపాయాలతో సర్జికల్ సెంటర్ను ప్రారంభించారు. కెన్యా, జింబాబ్వే, ఉగాండా ప్రాంతాల్లోని పిల్లలకు మంచినీరు అందించడం కోసం బావులు తవ్వించాడు. నెలకు వంద కోట్లకు పైగా ఆదాయం యూట్యూబ్ ద్వారానే అందుకుంటున్న మిస్టర్ బీస్ట్ ఇప్పుడు 50 కోట్ల సబ్ స్క్రైబర్ల మైలురాయి చేరుకున్నాడు.
Earth : బ్రెయిన్ కంటే పవర్ఫుల్ నెట్వర్క్ భూమి లోపల ఉందా? ఇది మనుషుల్ని ఎంతలా కాపాడుతుందో తెలుసా?





