Just NationalJust PoliticalLatest News

Cockroach Party : కాక్రోచ్ పార్టీ ఫౌండర్ పై దాడి.. అభిజీత్ దీప్కేకు చెంపదెబ్బ

Cockroach Party : అభిజీత్ అందరికీ అభివాదం చేస్తుండగా గుంపులో నుంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన కొందరు వ్యక్తులు ఆయనను చుట్టుముట్టారు. వారిలో ఇద్దరు అభిజీత్ దీప్కేపై దాడికి పాల్పడ్డారు

Cockroach Party

నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన చేస్తున్న కాక్రోచ్ పార్టీ(Cockroach Party) ఫౌండర్ అభిజీత్ దీప్కేకు ఊహించని పరిణామం ఎదురైంది. జైపూర్ లో సీజేపీ నిర్వహించిన ఆందోళనలో అభిజీత్ పై దాడి జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నప్పుడు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆయన చెంప చెళ్లుమనిపించారు.

ఆయన మద్దతుదారులు దీప్కేను భుజాలపై కూర్చోబెట్టుకుని నిరసన కార్యక్రమం దగ్గరకు తీసుకెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అభిజీత్ అందరికీ అభివాదం చేస్తుండగా గుంపులో నుంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన కొందరు వ్యక్తులు ఆయనను చుట్టుముట్టారు. వారిలో ఇద్దరు అభిజీత్ దీప్కేపై దాడికి పాల్పడ్డారు.

ఆయనను చెంపదెబ్బలు కొట్టారు. వెంటనే అప్రమత్తమైన సీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన వ్యక్తులపై మూకుమ్మడిగా ఎటాక్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. దాడికి పాల్పడిన వారు పారిపోతుండగా సీజేపీ మద్దతుదారులు వెంటపడడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారు పట్టుకునేలోపే దాడికి పాల్పడిన నిందితులు పారిపోయారు. దీనిపై కాక్రోచ్ పార్టీ(Cockroach Party) పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్నామనీ, దాడికి పాల్పడిన వ్యక్తులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

కాగా దీప్కేపై దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తనపై దాడి చేసిన వారిని వదిలేయాలంటూ దీప్కే విజ్ఞప్తి చేసినా ఆయన మద్దతుదారులు వినలేదు. ఇదిలా ఉంటే నీట్ పేపర్ లీకేజ్, సీబీఎస్‌ఈ ఉదంతాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళన చేస్తూ నిరసనలు తెలుపుతోంది.

Cockroach Party
Cockroach Party

గత నెలలో ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన వివరణ ఇచ్చినా నిరుద్యోగులు మండిపడ్డారు.

ఈ కారణంగా సోషల్ మీడియా వేదికగా అభిజీత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని(Cockroach Party) స్థాపించారు. కొద్ది గంటల్లోనే సీజేపీకి రికార్డు స్థాయిలో ఫాలోవర్లు రావడంతో వైరల్ గా మారింది. అమెరికాలో ఉంటున్న అభిజీత్ దీప్కే నిరసనల ప్రదర్శన కోసం ఇండియాకు వచ్చారు.

Nara Lokesh : లోకేష్, బ్రాహ్మణిల భక్తి రూపం..ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం విశిష్టత ఇదే..

Related Articles

Back to top button