Just SportsLatest News

Vaibhav Sooryavanshi : ఇదే తగ్గించుకుంటే మంచిది..వైభవ్ కి మాజీల సలహా

Vaibhav Sooryavanshi : 15 ఏళ్లకే ఇంత దూకుడు పనికిరాదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఓర్పుతో ఉంటేనే జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగుతాడని అంటున్నారు.

క్రికెట్ లో ఎంత టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ కూడా ఉండాల్సిందే. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చాలా ఆటంకాలు ఎదురైనా, పక్కదారి పట్టించే పరిస్థితులు ఉన్నా వాటిని అధిగమిస్తేనే సక్సెస్ అవుతారు. ఒకవేళ క్రమశిక్షణ కొరవడితే మాత్రం కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయిన ఆటగాళ్లను చాలా మందినే చూసాం.

ప్రస్తుతం భారత క్రికెట్ లో సంచలనాలకు చిరునామాగా మారిన వైభవ్ సూర్యవంశీ ఎక్కడ ఆడినా, క్రేజ్ మామూలుగా ఉండటం లేదు. అతను ఆడుతున్నందుకే ఎప్పుడూ లేని విధంగా ఏ జట్ల ట్రై సిరీస్ ను కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. అలాంటి చిచ్చర పిడుగు ఇప్పుడు ఆట కంటే వివాదంతో హైలైట్ అయ్యాడు.

ముఖ్యంగా శ్రీలంక ఏ జట్టుతో మ్యాచ్ లో ప్రత్యర్థి ప్లేయర్ ను వెనక్కి నెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మైదానంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు మాటలతో రెచ్చగొట్టడం సహజంగా జరిగేదే. కానీ దానికి రియాక్ట్ కాకుండా ఆట మీద ఫోకస్ పెడితేనే ముందుకెళ్లగలుగుతాం.

లంక ప్లేయర్స్ ఏదో అన్నారనీ మైదానంలో దూకుడుగా ప్రవర్తించిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi)కి పలువురు మాజీ ఆటగాళ్లు సూచనలు చేస్తున్నారు. ఆట నుంచి దృష్టి మళ్లించే ఇలాంటి విషయాలను పట్టించుకోవద్దంటున్నారు. ఒకవేళ పట్టించుకుంటే ఆట మరుగున పడిపోతుందని హెచ్చరిస్తున్నారు.

15 ఏళ్లే కదా కొంచెం కోపం కంట్రోల్ చేసుకోవడం కష్టమే అంటూ కొందరు వైభవ్ కు మద్దతుగా నిలుస్తున్నా అసలు నేర్చుకునే వయసులోనే అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తప్పవని వారు సూచిస్తున్నారు. నిజమే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో వైభవ్(Vaibhav Sooryavanshi) ను చాలా మంది పోలుస్తున్నారు.

సచిన్ కెరీర్ ఆద్యంతం ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, స్లెడ్జింగ్ వంటి వాటిని ఎన్నో ఎదుర్కొన్నాడు. ఏ రోజూ కూడా సచిన్ ప్రత్యర్థి ఆటగాళ్లపై దూకుడుగా ప్రవర్తించలేదు. తనను రెచ్చగొడితే వారికి బ్యాటింగ్ తోనే సమాధానమిచ్చేవాడు. ఇప్పుడు వైభవ్ ను కూడా అందరూ అదే ఫాలో అవ్వమంటున్నారు.

Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi

15 ఏళ్లకే ఇంత దూకుడు పనికిరాదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఓర్పుతో ఉంటేనే జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగుతాడని అంటున్నారు.అనవసర విషయాలు పట్టించుకోవద్దంటూ ఐపీఎల్ టైమ్ లో వైభవ్(Vaibhav Sooryavanshi) భుజం మీద చేయి వేసి మరీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ప్రత్యర్థి ఏం చేసినా, మాటలతో రెచ్చగొట్టినా లైట్ తీసుకోమని సలహా ఇచ్చారు. ఆట పైనే దృష్టంతా ఉండాలనీ, కెరీర్ ఎదిగేక్రమంలో ఓపిక చాలా అవసరమంటూ కోహ్లీ బుడ్డోడికి సలహాలు కూడా ఇచ్చాడు. అయితే ఇవేమీ వైభవ్ చెవికెక్కినట్టు లేవు. లంక ఏ జట్టు క్రికెటర్లు ఏదో అనగానే వారి మీదకు దూసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

H-1B Visa : హెచ్-1బీ వీసాపై మళ్లీ లక్ష డాలర్ల అదనపు ఫీజు..ఫెడరల్ కోర్టు తీర్పుపై స్టే

Related Articles

Back to top button