Relation : ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే చీప్ అవ్వాల్సిందేనా? బంధాల్లో దీనిని కాపాడుకోవడం ఎలా?
Relation : బంధాల్లో ఎప్పుడైనా సరే పర్సనల్ బౌండరీస్ అనేవి చాలా అవసరం. అవతలి వ్యక్తి కోసం ఎంతవరకు నిలబడాలో అలాగే ఎప్పుడు వెనక్కి తగ్గాలో మనకు బాగా తెలిసి ఉండాలి
Relation
ఎవరికైనా సరే వారి లైఫ్‌లో ఎదుటివారికి మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే.. మెల్లగా వాళ్ల దృష్టిలో చీప్ అయిపోతామని పెద్దలు చెబుతుంటారు. మనలో చాలామందికి ఇది లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవమయ్యే ఉంటుంది.
ఇది వినడానికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా హ్యూమన్ రిలేషన్షిప్ పరంగా ఇది నూటికి నూరు శాతం నిజం. ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు కానీ గౌరవించినప్పుడు కానీ వాళ్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం.
కానీ చిత్రంగా, కొన్ని రోజుల తర్వాత అవతలి వ్యక్తి మనల్ని చాలా తేలికగా (Taken for granted) తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. మనం ఇచ్చే ప్రేమ, గౌరవం వాళ్లకు రానురాను ఒక చీప్ వస్తువులా అనిపిస్తాయి. నిజానికి ప్రేమగా చూసుకునే మనస్తత్వం ఉన్నవాళ్లను ఎదుటి వాళ్లు ఎందుకు లోకువ చేస్తారనే విషయాన్ని ఆర్థికశాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రం ప్రకారం చూడొచ్చు.
లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ (Law of Diminishing Marginal Utility) ప్రకారం… అంటే మార్కెట్లో ఒక వస్తువు సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు, ఆటోమేటిక్‌గా దాని విలువ లేదా ధర పడిపోతుంది. మనుషుల సైకాలజీకి కూడా సరిగ్గా ఇదే పనిచేస్తుంది.
అవతలి వ్యక్తి పిలవగానే, మన పనులన్నిటిని పక్కన పెట్టి మరీ వారి ముందు వాలిపోతుంటే.. వాళ్ల మనసులో మనపై ఉన్న గౌరవం మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీడికి వేరే పనేం లేదు, నేను ఎప్పుడు పిలిచినా వస్తాడనే భావన అవతలి వ్యక్తి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్లిపోతుంది. మీ టైమ్, ఎనర్జీ వాళ్లకు చాలా ఈజీగా, ఫ్రీగా దొరికేసరికి.. మీపట్ల వారికి అప్పటి వరకూ ఉన్న విలువ క్రమంగా తగ్గిపోతుంది.
దీని వెనుక ఉన్న మరో సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే.. ఈక్వాలిటీ ఇన్ రిలేషన్షిప్స్ అంటే బంధాలలో(Relation) సమానత్వం. ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది ఎప్పుడూ టూ వే ట్రాఫిక్‌లా ఉండాలి. అంటే ఒకరు ఎంత ఇస్తున్నారో, అవతలి వ్యక్తి నుంచి కూడా అంతే గౌరవం, ప్రేమ తిరిగి రావాలి.
కానీ మనం అవతలి వాళ్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే.. వాళ్లు మనల్ని పట్టించుకోకపోయినా సరే భరిస్తూ ఉంటే.. అక్కడ మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. సైకాలజీ ప్రకారం ఎవరైతే తమకు తాము రెస్పెక్ట్ ఇచ్చుకోరో..లేదా లోకువ చేసుకుంటారో.. సొసైటీ కూడా వాళ్లను అస్సలు గౌరవించదు.
అంటే మీ అతి మంచితనమే అవతలి వాళ్లకు మెల్లగా ఒక బలహీనతలా కనిపిస్తుందన్నమాట. దాంతో వాళ్లు మిమ్మల్ని చాలా ఈజీగా హర్ట్ చేయడం కానీ, తమ అవసరాలకు వాడుకోవడం కానీ స్టార్ట్ చేస్తారు.
అయితే, ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనించాలి. ఎదుటి వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు కాదు.. కానీ అది ఎవరికి ఇస్తున్నామనేదే ముఖ్యం. కొంతమంది వ్యక్తులు మనమిచ్చే విలువను గుర్తించి, మనకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. కానీ మెజారిటీ జనాలు మాత్రం చాలా తేలికగా తీసుకుంటారు. అలాంటి వాళ్ల కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.

బంధాల్లో(Relation) ఎప్పుడైనా సరే పర్సనల్ బౌండరీస్ అనేవి చాలా అవసరం. అవతలి వ్యక్తి కోసం ఎంతవరకు నిలబడాలో అలాగే ఎప్పుడు వెనక్కి తగ్గాలో మనకు బాగా తెలిసి ఉండాలి. మనకంటూ ఒక లైఫ్, కొన్ని పనులు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాయని తెలిసినప్పుడే అవతలి వ్యక్తి మనల్ని గౌరవిస్తాడు.
కాబట్టి అనవసర బంధాల(Relation) కోసం ప్రాకులాడటం ఆపేసి.. మీ ఇంపార్టెన్స్‌ను గుర్తించే వాళ్లకు మాత్రమే మీ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం నేర్చుకోండి. లేదంటే చివరకు ఎంత గొప్ప స్నేహమైనా, ప్రేమయినా ఎదుటి వాళ్ల దృష్టిలో మీరు ఒక చీప్ క్యారెక్టర్‌గా మిగిలే అవకాశం ఉంటుంది.
Diabetes : నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? డయాబెటిస్‌కు, నిద్రకు ఉన్న లింక్ తెలిస్తే షాకే..





